విజన్‌ 2020 అంటున్నాడు..!

దర్శకుడు ఈవీవీ కొడుకుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ కామెడీ హీరోగా సెటిల్ అయ్యాడు. కామెడీ హీరోగా నవ్వులు పూయించే అల్లరి నరేష్ చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలను కంప్లీట్ చేసాడు. అయితే అల్లరి కామెడీ బోర్ కొట్టిన ప్రేక్షకులు అల్లరి నరేష్ నటించిన సినిమాలను వరసగా రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హీరోగా ఇబ్బందులు పడుతున్న అల్లరి నరేష్… మహేష్ మహర్షి మూవీ లో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. అల్లరి నరేష్ మహేష్ మూవీ స్పెషల్ కేరెక్టర్ అంటే ఒక సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ రోల్ మహర్షి మూవీకి ఎంతో కీలకం. అయితే హీరోగా ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన సిల్లీ ఫెలోస్ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మెగా ఫోన్ పట్టుకుంటాడా..?

నరేష్ కి ఉన్న క్రేజ్ కాస్త తగ్గడంతో సిల్లీ ఫెలోస్ సినిమా మీద భారీ అంచనాలైతే లేవు. హీరో సునీల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అల్లరి నరేష్ ఈ మూవీ హిట్ మీద అసలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే హీరోగా మరిన్ని అవకాశాలొస్తాయని ఆశపడుతున్నాడు. అయితే అల్లరి నరేష్ కి హీరో మీద కన్నా దర్శకత్వం మీదే మక్కువ ఎక్కువని.. కానీ తండ్రి ఈవివి అప్పుడే దర్శకుడిగా ఏం మారతావులే.. హీరోగా కంటిన్యూ చెయ్యమని చెప్పగానే అల్లరి మరు ఆలోచించకుండా హీరోగా సెటిల్ అవవడంతో దర్శకత్వాన్ని వదిలిపెట్టక తప్పలేదు. కానీ అల్లరి నరేష్ ప్రస్తుతం హీరోగా అవకాశాలు సన్నగిల్లుతున్న టైంలో దర్శకత్వం గురించి ఆలోచిస్తున్నాడనే ప్రచారం గత ఏడాది జరిగింది.

కొత్తవాళ్లతో సినిమా…

అయితే అల్లరి నరేష్ నిజంగానే దర్శకుడిగా మారబోతున్నాడట. ఇప్పటికే కొత్తవాళ్లతో ఒక సినిమా చెయ్యడానికి అల్లరి నరేష్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్ ఇంటర్వ్యూ లో భాగంగా… దర్శకుడిగా మారడానికి ఇంకొంచెం సమయం ఉందని… 2020లో తానూ మెగా ఫోన్ పట్టబోతున్నట్టుగా… దర్శకత్వం చేయాలనే ఆలోచనకు తాను ‘విజన్‌ 2020’ని ఒక పేరు కూడా పెట్టుకున్నానని నరేష్ చెప్పాడు. మరి ఇప్పటికే నటుడు రాహుల్ రవీంద్రన్ నటుడిగా ప్రూవ్ చేసుకుని… ఇప్పుడు చి.ల.సౌతో దర్శకుడిగా కూడా హిట్ కొట్టి దర్శకుడిగా తనకి తాను ప్రూవ్ చేసుకున్నాడు. అల్లరి నరేష్ కూడా దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*