పన్ను కట్టకుండా అల్లు అరవింద్ స్కెచ్..?

10 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమాకు రూ.40-50 కోట్ల లాభాలు నిర్మాణ సంస్థకు అందాయని అంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. 60 కోట్లు షేర్ తో ఏమాత్రం జోరు తగ్గించకుండా అదే జోరుతో దూసుకుపోతుంది. ఇంకా కొన్ని ఏరియాస్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి అంటే ఆ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్, రీమేక్ హక్కుల ద్వారా భారీగా డబ్బులు అందుకోనుంది ఆ సంస్థ.

పేపర్ బాయ్ తీసుకుంది అందుకేనా..?

అయితే వచ్చిన ఆ ప్రాఫిట్స్ తో ఎంజాయ్ చేయాల్సిన అల్లు అరవింద్ అండ్ టీం చిన్నచిన్న తప్పులు చేసి హాట్ టాపిక్ అవుతున్నారు. రీసెంట్ గా సంపత్ నంది ప్రొడక్షన్ లో ‘పేపర్ బాయ్’ అనే సినిమా వచ్చింది. దాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ద్వారా ఎందుకు రిలీజ్ చేశారో అర్ధం కాలేదు. సినిమా చూస్తే అనుకున్న స్థాయిలో లేదు. మరి అటువంటి చిత్రాన్ని ఎందుకు టేకప్ చేశారో ఎవరికీ తెలియలేదు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా లేవు. రిలీజ్ తర్వాత నెగటివ్ టాక్ వచ్చిన ఆ సినిమాని పట్టించుకోలేదు.

మరో చిన్న సినిమా కూడా…

అయితే ఆ సినిమాను కావాలనే తీసుకున్నారని తెలుస్తుంది. ‘గీత గోవిందం’కు వచ్చిన ఆదాయంతో ఆదాయపు పన్ను భారీగా కట్టాల్సి వస్తుందని.. అందులో కోత వేయించుకునేందుకు నష్టాలు చూపించడానికి పేపర్ బాయ్ సినిమాను తీసుకున్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ సందేహాలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు మరో చిన్న సినిమాను ‘గీతా ఆర్ట్స్’ టేకప్ చేసింది. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా వస్తున్న ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. మరి సినిమాలో కంటెంట్ నచ్చే అల్లు అరవింద్ ఇలా రిలీజ్ చేస్తున్నారా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*