అందుకేనా ముంబయి వెళ్లింది..!

ఆ మధ్యన అల్లు అర్జున్ ముంబయి రెస్టారెంట్ లో కనిపించేసరికి అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ చెయ్యబోతున్నాడంటూ ఒకటే ప్రచారం జరిగింది. అయితే భార్య పిల్లలతో అల్లు అర్జున్ ముంబయిలో షికార్లు కొట్టిన మాట వాస్తవమే కానీ.. అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీ ఒక రూమరంటూ కొట్టిపారేశారు. ఇక విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకుతన్నాయి కానీ.. ఎక్కడ కంఫర్మేషన్ మాత్రం రావడం లేదు. అల్లు అర్జున్ అదిగో ఇదిగో అంటున్నాడు. అలాగే ఫాన్స్ కి మంచి సినిమా కావాలంటే వెయిట్ చెయ్యాలని మెసేజ్ ఇస్తున్నాడు కానీ.. తన నెక్స్ట్ మూవీ పై క్లారిటీ ఇవ్వడం లేదు.

కపిల్ బయోపిక్ లో ఉంటాడా..?

తాజాగా మరో వార్త అల్లు అర్జున్ మీద ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కపిల్ దేవ్ బయోపిక్ లో బన్నీ నటిస్తాడంటూ గాసిప్ సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ బయోపిక్ లో అల్లు అర్జున్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. 1983లో భారత్ కు క్రికెట్ వరల్డ్ కప్ వచ్చిన బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలు అర్జున్ నటిస్తున్నాడనేది నిజమో.. పుకారో తెలియదు కానీ.. ఆ వార్త ఇపుడు ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక ఆ మధ్యన అల్లు అర్జున్ ముంబయి వెళ్లింది ఈ సినిమా చర్చల కోసమే అంటూ మరో వార్త ఇప్పుడు షికారు చేస్తుంది.

హిందీలోనూ మంచి క్రేజ్

అయితే ఆలు అర్జున్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ నటించిన ప్రతి తెలుగు సినిమా హిందీ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. అయితే అల్లు అర్జున్ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండా మనసుకు నచ్చిన ఏదైనా కీలక పాత్ర దొరికితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తానని గతంలో అల్లు అర్జున్ చెప్పడం బట్టే కపిల్ దేవ్ బయోపిక్ లో అల్లు అర్జున్ నటిస్తున్నాడని వార్త అంత త్వరగా స్ప్రెడ్ అయ్యిందంటున్నారు మెగా ఫాన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*