ఈసారి గ్యాప్ రాదంటున్నాడు.. నమ్మొచ్చా..?

బన్నీ లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య’ వసూళ్లు, కంటెంట్ పరంగా పూర్తి నిరాశపరిచింది. దీంతో బన్నీ, తన ఫ్యాన్స్ ఈ సినిమాతో బాగా నిరాశ చెందారు. అందుకోసం బన్నీ తన తర్వాతి సినిమా చేసేందుకు బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈసారి ఆయన తన సినిమాల విషయంలో, దర్శకుల విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట.

స్టార్ డైరెక్టర్లతో రెండు సినిమాలు….

విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో బన్నీ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. బన్నీకి.. విక్రమ్ కుమార్ కథ కూడా చెప్పాడు. కాకపోతే అందులో కొన్ని మార్పులు చేయమని బన్నీ కోరగా ఆ మార్పులను చేసేసి విక్రమ్ కుమార్ రంగంలోకి దిగనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వరుసగా రెండు సినిమాలని లైన్ లో పెట్టుకున్నాడు. అది కూడా స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, సురేందర్ రెడ్డితో తన సినిమాలు ఉండేలా బన్నీ చూసుకున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో బన్నీ.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాడు. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘రేసు గుర్రం’ చేయగా అది ఘన విజయం సాధించింది. అందువలన ఈ ఇద్దరి దర్శకులను బన్నీ లైన్లో పెట్టేశాడని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*