అల్లు అర్జున్ సరసన లక్కీ హీరోయిన్..?

allu arjun trivikram film updates

అల్లు అర్జున్ గత ఏడాది ఏప్రిల్ లో నా పేరు సూర్యతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కొత్త దర్శకుడితో సినిమా చేసి మరీ చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మంచి కథతో సినిమా చెయ్యడానికి.. దర్శకుడిని ఎన్నుకోవడానికి అల్లు అర్జున్ కి చాలా రోజులే పట్టింది. తాజాగా త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది కాని.. సినిమా మాత్రం మొదలయ్యేది ఫిబ్రవరిలోనే అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో త్రివిక్రమ్ కాస్త బిజీగా ఉన్నాడు. హారిక హాసిని తో కలిసి గీత ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్, బన్నీ సినిమా కథపై కూర్చుకున్నాడు. అయితే త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో తియ్యబోయే సినిమాని హాలీవుడ్ సినిమా కథ నుండి ఇన్స్పైర్ అయ్యి సినిమా చేస్తున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.

లిస్ట్ లో చేరిన రష్మిక

ఇక అల్లు అర్జున్ సరసన మహేష్, రామ్ చరణ్ ల పక్కన నటించిన కైరా అద్వానీ ఫిక్స్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ లోకి ఎంట్రినే టాప్ స్టార్స్ తో ఇచ్చినా కైరా ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన కూడా ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. ఇక కైరా కూడా నా చేతిలో మరో బిగ్ ప్రాజెక్ట్ ఉందంటుంది కానీ… అల్లు అర్జున్ సినిమాకే అని కమిట్ అవ్వడం లేదు. తాజాగా అల్లు అర్జున్ పక్కన మరో భామ పేరు వినబడుతుంది. అదే ఛలో, గీత గోవిందం హీరోయిన్ రష్మిక పేరు కూడా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా రష్మికది గోల్డెన్ హ్యాండ్. అలాంటి క్రేజున్న హీరోయిన్ తమ సినిమాలో నటిస్తే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని త్రివిక్రమ్ – బన్నీ ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి వినయ విధేయ రామ టాక్ లో తేడా వస్తే కైరాని తప్పించి రష్మికని తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. చూద్దాం అల్లు హీరో సరసన కైరానా లేదంటే రష్మికనా అనేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*