ఇప్పుడే కాదు… త్వ‌ర‌లో చెబుతాను

allu arjun trivikram film updates

అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం మెగా అభిమానుల నిరీక్షణ మాములుగా లేదు. నా పేరు సూర్య విడుదలై నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా కొత్త సినిమా ప్రకటించకుండా తప్పించుకుంటున్న అల్లు అర్జున్ పై మెగా అభిమానులు గుర్రుగానే ఉన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అని ప్రచారం జరిగినప్పుడు… వినాయక చవితికి మెగా ఫాన్స్ కి శుభాకాంక్షలు తెలిపి మరి… నా సినిమా మొదలవడానికి కొద్దిగా టైం పడుతుంది.. అప్పటివరకు ఓపిక పట్టండని చెప్పాడు. ఇక తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అన్నారు.

మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే

ఇక ఈ రోజు దీపావ‌ళి సందర్భంగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమాపై ప్రకటన వస్తుంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక మెగా అభిమానులు నిన్న రామ్ చరణ్ వినయ విధేయరామ లుక్, టైటిల్ తో పండగ చేసుకుంటే.. ఈ రోజు అల్లు అర్జున్ న్యూస్ మూవీ ఎనౌన్సమెంట్ తో పండగ చేసుకుందామనుకుని ఎదురు చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం… భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హ తో కలిసి అందమైన ఫోటో దిగి మెగా ఫాన్స్ కి దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. అంతేకాదు.. నా చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. మరి కొన్ని రోజుల్లో నా కొత్త చిత్రం వివరాలను తెలియజేస్తాని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. దీంతో అభిమానులు అల్లు అర్జున్ సినిమా కోసం మరికొంతకాలం వేచి చూడడం తప్పేలా లేదు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*