బన్నీ కోరాడు..విక్రమ్ పాటిస్తున్నారు!

టాలీవుడ్ లో పెద్ద హీరోలు అంతా ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమా ఏంటో అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా కి ముందు ఏ సినిమా అన్నది కమిట్ అవ్వలేదు. ఎందుకంటే ‘నా పేరు సూర్య’ కు వచ్చిన రెస్పాన్స్ చూసి తన తర్వాత సినిమా ఎటువంటి జోనర్ లో చేయాలనీ నిర్ణయించుకున్నాడు.

విక్రమ్ ఒక్కడే…

అయితే ‘నా పేరు సూర్య’ ప్లాప్ కావడంతో ఇక తను ప్రయోగాలు మానేసి కమర్షియల్‌ చిత్రం చేయడానికి ఫిక్స్‌ అయ్యాడు. కాకపోతే అతని లిస్ట్ లో విక్రమ్ కుమార్ తప్ప మరే దర్శకుడు ఇప్పుడు తనకి అందుబాటులో లేడు. విక్రమ్‌ కుమార్‌ అంటే ప్రయోగాత్మక సినిమాలకి పెట్టింది పేరు. విక్రమ్ లేటెస్ట్ గా బన్నీకి ఓ కథ వినిపించాడట. కానీ అది విక్రమ్ మార్కు, వెరైటీ కథలా ఉందంట.

క్లాస్, మాస్ ను ఆకట్టుకునేలా…

వెరైటీ ఉండాలి, కానీ కమర్షియల్‌ అంశాలు మిస్‌ అవకూడదని, ‘రంగస్థలం’ చిత్రంలా కొత్తదనం ఉంటూనే కమర్షియల్‌ మీటర్‌ ఫాలో అవ్వాలని విక్రమ్‌ ని బన్నీ కోరడంతో విక్రమ్ అటువంటి కథ చేసే పనిలో పడ్డాడట. లేటెస్ట్ గా ‘24’, ‘హలో’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో విక్రమ్ డిమాండ్‌ తగ్గింది. సుకుమార్ లా మాస్‌ని, క్లాస్‌ని బ్యాలెన్స్‌ చేసే సినిమాతో వచ్చేస్తాడేమో చూడాలి.