బాబాయ్ తో కేక్ కట్ చేయించిన బుడతలు

ఆలు అరవింద్ సక్సెస్ ఫుల్ నిర్మాత. ఆయన కొడుకు అల్లు అర్జున్ సక్సెస్ ఫుల్ స్టార్ హీరో. పెద్దకొడుకు బాబీకి ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ చిన్నపాటి హీరో. స్టార్ హీరో అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ ని మలుచుకుంటున్నాడు శిరీష్. కానీ శిరీష్ ని హీరోగా నిలబెట్టే హిట్ మాత్రం పడడం లేదు. ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేస్తున్న అల్లు శిరీష్ తన 31 వ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యుల మధ్యన అల్లు శిరీష్ తన పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నాడు.

ఫోటో వైరల్…

అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, అల్లు ఆర్జున్ కొడుకు అయాన్, కూతురు అల్లు అర్హ లు కలిసి అల్లు శిరీష్ చేతే పుట్టినరోజు కేక్ కటింగ్ చేయించారు.  అల్లు శిరీష్ అన్న, వదిన, పిల్లల మధ్యలో సంతోషంగా కేక్ కట్ చేసాడు. మరి అల్లు అర్జున్ అండ్ క్యూట్ ఫ్యామిలీ ఉన్న ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఎంతో ముద్దుగా తన బాబాయ్ తో కేక్ కట్ చేయించారు అర్హ, అయాన్ లు. మరి మీరు ఆ క్యూట్ అండ్ సూపర్ ఫ్యామిలీ ఫోటోని తనివితీరా వీక్షించండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*