అల్లు అర్జున్ లైన్ లో మాస్ డైరెక్టర్…!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోస్ నుండి చిన్న హీరోస్ వరకు అంత చాలా త్వరగా సినిమాలు చేసి.. రిలీజ్ చేసి..నెక్స్ట్ సినిమా త్వరగా స్టార్ట్ చేస్తుంటే స్టార్ హీరోస్ మాత్రం ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకుని తమ నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ముందు ఉన్నారు. ‘నా పేరు సూర్య’ తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీపై చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకు తన నెక్స్ట్ మూవీ ఏంటో..ఎవరితో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

త్రివిక్రమ్ తోనేనా?

ఈనేపధ్యంలో అల్లు అర్జున్…త్రివిక్రమ్, విక్రమ్ కే కుమార్ లతో..ఎవరితో సినిమా చేద్దాం అనే విషయంపై సందిగ్ధత ఉండేది. ‘అరవింద సమేత’ హిట్ తో త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. సో బన్నీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో ఉంటుంది. ఆ తర్వాత ఆయన సినిమా సుకుమార్ తో ఉండవచ్చనే టాక్ వినిపించింది. విక్రమ్ కుమార్ .. సుకుమార్ సినిమాలు ప్రయోగాత్మకంగా ఉంటాయి కాబట్టి ఆ తరహా కథల జోలికి వెళ్లకూడదని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడట.

బోయపాటి పేరు కూడా…..

ప్రస్తుతం వీరిని హోల్డ్ ని పెట్టుకుని త్రివిక్రమ్ తో సినిమా చేసిన తర్వాత మరో మాస్ మూవీ మాస్ డైరెక్టర్ తో చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఈనేపధ్యంలో తెరపైకి బోయపాటి పేరు వస్తుంది. బోయపాటి చరణ్ చిత్రం తర్వాత బాలకృష్ణ తో సినిమా చేయనున్నాడు. ఈరెండు సినిమాల తర్వాత బోయపాటి..బన్నీతో చేసే అవకాశముందని తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*