క్లీన్ ‘‘యు’’గా వస్తున్నాడు…!

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హా నిర్మాత‌గా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈసినిమా సెన్సార్ ప‌నుల‌ను పూర్తిచేసుకుంది. సింగిల్ క‌ట్ కూడా లేకుండా క్లీన్ `యు` స‌ర్టిఫికెట్ ల‌భించింది. అనుకున్న‌ట్లుగానే ఈనెల 25న భారీ ఎత్తున‌ సినిమా ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

బాల్యం గుర్తు చేసే సినిమా…

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ.. `ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. యూట్యూబ్ లో టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నెటిజెన్లంతా తమ బాల్యం గుర్తు చేసారని కామెంట్ల రూపంలో త‌మ అభిప్రాయాల‌ను తెలిపారు. తాజాగా మా సినిమా సెన్సార్ ప‌నుల‌ను పూర్తిచేసుకుంది. ఒక్క క‌ట్ కూడా లేకుండా సెన్సార్ బృందం క్లీన్ `యు` స‌ర్టిఫికెట్ జారీ చేసింది. చ‌క్కని కుటుంబ క‌థా చిత్రం తీశార‌ని, అందులో భావాలు, బావోద్వేగాలు హృద‌యాన్ని హ‌త్తుకున్నాయ‌ని సెన్సార్ టీమ్ ప్ర‌శంసించ‌డం చాలా ఆనందంగా ఉంది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా అని మెచ్చుకున్నారు. ఈనెల 25న గ్రాండ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ మా సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది` అని అన్నారు.

కుటుంబ కథా చిత్రం…

చిత్ర ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ.. `చ‌క్కటి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం, స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌చ్చింది. టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి వివేష స్పంద‌న ల‌భించింది. పలువురు సినీ పెద్ద‌లు కూడా టీజ‌ర్ చూసి ఎంతో బాగుంద‌ని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సెన్సార్ వారు కూడా మా సినిమా చూసి మెచ్చుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమాకు వాళ్ల ప్ర‌శంస‌లు క‌లిసి వ‌స్తాయ‌ని భావిస్తున్నాం. ఒక్క క‌ట్ కూడా లేకుండా క్లీన్ `యు ` స‌ర్టిఫికెట్ తో మీ ముందుకు వ‌స్తున్నాం. ఈనెల 25న సినిమా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం. తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*