సముద్రపు అంచున రంగమ్మత్త..!

ఒకప్పుడు హాట్ యాంకర్ గా అందరి నోళ్ళలో నానిన అనసూయ ఇప్పుడు రంగస్థలంలో చేసిన పాత్ర పేరు రంగమ్మత్తగా అందరి నోళ్ళలో నానుతుంది. జబర్దస్త్ స్టేజ్ మీద మిడ్డీ , ఫ్రాక్ లాంటివి వేసినా… రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా చీర మడిసి కట్టినా అనసూయకున్న క్రేజే వేరు. అనసూయ స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే హీరోయిన్ లా ఆమెకి కూడా కుర్రకారు నుండి విజిల్స్ పడతాయి అంటేనే ఆమె క్రేజ్ అర్ధమవుతుంది. పెళ్ళై పిల్లలు తన ఎత్తు పెరుగుతున్నప్పటికీ అనసూయ అందం మాత్రం తరగడం లేదు. ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్సులతో పడేసే అనసూయ రంగస్థలం సినిమాలో పల్లెటూరి సర్పంచ్ గా, రంగమ్మతగా అదరగొట్టేసింది.

బీచ్ లో ఎంజాయ్ చేస్తూ…

గోదావరి యాసతో.. రామ్ చరణ్, సమంత కి ధీటుగా రంగస్థలంలో నటనకు మార్కులు వేయించుకుంది. ఇక ప్రస్తుతం ఎఫ్ 2 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ బీచ్ ఒడ్డున బుల్లి ఫ్రాక్ తో సముద్రపు అందాలతో పాటు తన అందాలను చూపిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫోటో ని అనసూయ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇసుకలో మోకాళ్ళపైన కూర్చుని ఉన్నఅనుసూయ బీచ్ పిక్ ఇప్పుడు నెట్ లో వైరల్ అయ్యింది. ఇక ఆ పిక్ తో పాటుగా గత జన్మలో నేను మత్స్య కన్యగా ఉన్నానని అనిపిస్తోందని, కానీ మత్స్యకన్యలకు మరణం అనేది ఉండదని అంటారు.. నేనూ అంతేనంటూ పోస్ట్ చేసి అందరిని కన్ఫ్యూజన్ లో పడేసింది.అనసూయ ఏమిటి ఇలా చేసింది అంటూ ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు తెరలేపారు. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ తన ఫ్యామిలీ హాలిడే వెకేషన్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కానీ.. తాజాగా ఆమె చేసిన ఈ బీచ్ పిక్ పోస్ట్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*