మమ్మల్నీ సంప్రదించారు…

అమెరికాలోని షికాగోలో బట్టబయలైన సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. తెలుగువారైన ఎన్ఆర్ఐ దంపతులు మొదుగుమూడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, చంద్ర దంపతులను వ్యభిచార ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. వీరు షోలు, ఈవెంట్ల పేరు చెప్పి కొందరు తెలుగు నటులు, యాంకర్ లను అమెరికా తీసుకువెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు అక్కడి కోర్టుకు తెలిపారు. అయితే ఈ సెక్స్ రాకెట్ తనను కూడా సంప్రదించిందని నటి శ్రీరెడ్డి చెప్పింది. కాగా, ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా ఇప్పుడు ఈ దంపతుల గురించి బయటపెట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 2016లో శ్రీరాజ్ అమెరికా ఫోన్ నెంబర్ తో తనకు ఫోన్ చేసి అక్కడ జరిగే తెలుగు వేడుకకు రావాలని ఆహ్వానించారని, వారి మాటతీరు సరిగ్గా లేకకపోవడంతో తాను వేడుకలకు వెళ్లలేదని అనసూయ తెలిపింది. తాను హాజరుకానని చెప్పినా వారు పోస్టర్ లో తన ఫోటో వేయించారని, తాను ఈ వేడుకకు రావడంలో లేదని ట్విట్టర్ లో చెప్పానని ఆమె తెలిపారు. ఇక, ఈ విషయంపై చర్చించేందుకు ఈ నెల 24న మూవీ ఆర్టిస్ట్సి అసోసియేషన్(మా) సమావేశంలో నిర్వహించాలని నిర్ణయించారు.