అనిల్ సినిమాలో మహేష్ పాత్ర ఏంటి…?

Mahesh babu on next movie

ప్రస్తుతం మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నాడు. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను దిల్ రాజుతో పాటు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో మహేష్ దూకుడు తరహాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నాడనే టాక్ కొద్ది రోజుల నుండి వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అది నిజం కాదట. ఇందులో మహేష్ పోలీస్ పాత్రే చేయట్లేదు అని ఇన్సైడ్ టాక్. పోలీస్ పాత్ర కాకపోతే మరి ఏ పాత్ర అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు. పైగా ఈ మూవీ ఏ జోనర్ అనేది కూడా ఇంకా అంతుచిక్కడం లేదు. మొదటి నుండి ఇది ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ అని క్లారిటీ ఉంది. అందుకే ఇందులో మహేష్ కు అత్తగా అలనాటి సీనియర్ హీరోయిన్ విజయశాంతి తీసుకున్నారు.

సంక్రాంతికి రిలీజ్ చేసేలా

భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మహేష్ అనిల్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు. పైగా అనిల్ కామెడీ సీన్స్ ను బాగా రాసుకుంటాడు. దానికి మహేష్ కామెడీ టైమింగ్ యాడ్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ వ‌ర‌కు ఫస్ట్ కాపీతో రెడీగా ఉండాలి ప్లాన్ చేస్తున్నారు. అనిల్ ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా మహేష్ లాంటి స్టార్ హీరో కాబట్టి అనిల్ రావిపూడి మీద చాలా ఒత్తిడి ఉంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాడట.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*