పాపం అంజలి పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది..!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ లో అన్ లక్కీ గర్ల్ ఎవరు అంటే వెంటనే ఏమీ ఆలోచించకుండా అంతా అంజలి పేరు చెపుతారు. అంజలి తెలుగులో తన కెరీర్ ని స్టార్ట్ చేసినా.. ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి తన టాలెంట్ తో వరసగా అక్కడ 13 సినిమాల దాకా చేసింది. ఆ తర్వాత మహేష్ – వెంకటేష్ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి మల్టీ స్టారర్ లో నటించినా, ఎందుకో ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు.

రెమ్యూనరేషన్ తగ్గించి…

ఆలా ఆమె తమిళ, తెలుగు సినిమాలు చేస్తుండగా రవి తేజ ‘బలుపు’, రామ్ ‘మసాలా’, ‘గీతాంజలి’లో నటించింది. ‘గీతాంజలి’తో ఆమెకు మంచి పేరు వచ్చినా ఆ తర్వాత ఆఫర్స్ మాత్రం రాలేదు. పాపం ఆమెకు కోలీవుడ్ లో కూడా అదే పరిస్థితి. బొద్దుగా ఉన్న అంజలి రీసెంట్ గా సన్నపడినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆమెకు ఏమి చేయాలో అర్ధం కాకా తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించుకుందట.

కొత్త హీరోయిన్లలా…

ఇటీవల తెలుగులో ఓ సినిమాను కేవలం రూ. 60 లక్షలకు చేయడానికి ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. తెలుగులో కొత్తగా వచ్చిన హీరోయిన్సే ఒక్కో సినిమాకు రూ.50 లక్షల తీసుకుంటున్న ఈ రోజుల్లో అంజలి పరిస్థితి ఇలా అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈమె ‘లిసా’ అనే మల్టీ లాంగ్వేజ్ ఫిలింతో పాటు విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తుంది. రెమ్యునరేషన్ ను తగ్గించింది కాబట్టి ఆఫర్స్ ఏమన్నా వస్తాయేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*