సై రా కు సమస్యలు ముదురుతున్నాయి..!

చిరంజీవి – రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే మొన్నటివరకు సినిమా షూటింగ్ నత్తనడకన నడిచేసరికి.. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో అయినా విడుదలవుతుందా అనే అనుమానంలో ప్రేక్షకులు ఉన్నారు. దీంతో సై రా షూటింగ్ జెట్ స్పీడు లో జరుగుతుందనేలా హైదరాబాద్ షెడ్యూల్ సాగింది. అయితే సై రా సినిమాపై సమస్యలు చుట్టుకుంటున్నాయి. అందులో నిన్నటికి నిన్న సై రా నరసింహారెడ్డి సినిమా కోసం వేసిన సెట్ ని రెవెన్యూ అధికారులు కూల్చేసినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఆ స్థలం ప్రభుత్వ స్థలం కావడం.. అనుమతులు లేకుండా సై రా కోసం సెట్ నిర్మించగా… ఆ సెట్ ని రెవెన్యూ అధికారులు కూల్చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

పేరుపైనా అభ్యంతరం

అదలా ఉండగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలవ్వకముందు సై రా సినిమా దర్శకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబందించిన పూర్వీకులను కలుసుకుని ఉయ్యాలవాడ చరిత్రని తెలుసుకుని మరీ ఈ సినిమా ని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. అయితే ఈ సినిమాకి ఉయ్యాలవాడ అనే టైటిల్ పెట్టకుండా సై రా అనే టైటిల్ పెట్టినప్పుడు ఉయ్యాలవాడ బంధువులు కాస్త చిన్నబుచ్చుకున్నప్పటికీ.. మళ్లీ సైలెంట్ అయ్యారు. మళ్లీ సై రా షూటింగ్ 30 నుండి 40 శాతం కంప్లీట్ అయ్యాక… ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని నిర్మిస్తున్నందుకు తమకు సంతోషంగానే ఉన్నప్పటికీ.. తమకి కనీస గుర్తింపును సై రా చిత్ర బృందం ఇవ్వడం లేదని ఉయ్యాలవాడ వంశస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉయ్యాలవాడ వంశస్థుల ఆవేదన

స్వాతంత్య్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాహసాలను సై రా నరసింహారెడ్డి గా అందరికీ అర్థమయ్యే రీతిలో సినిమాగా చేస్తున్నందుకు తమకి చాలా సంతోషంగా ఉందని.. కానీ సై రా టీమ్ తమని పట్టించుకోవడం లేదని…. తామంతా చిరంజీవి, రామ్ చరణ్ తో మాట్లాడేందుకు కర్నూల్ నుండి హైదరాబాద్ కి తిరుగుతున్నామని.. అయనా, చిరు కానీ, చరణ్ కానీ తమతో ఇంత వరకు మాట్లాడేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి మీతో మాట్లాడతారని తమకి చెప్పి పంపిస్తున్నారని… అసలు తమ ఆవేదనని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ పని మాత్రం చేసుకుంటున్నారంటూ వారు తమ ఆవేదనని ఒక ఛానల్ సాక్షిగా వెళ్లగక్కారు. మరి ఇలాంటి నెగెటివ్ న్యూస్ లు సై రా మీద రావడం కాస్త బాధాకర విషయమే. అయినప్పటికీ సినిమాకి మాత్రం ఫ్రీగా పబ్లిసిటీ వచ్చేస్తుందని భావిస్తుందేమో సై రా టీమ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*