‘RRR’ కోసం మరో ‘R’ వస్తుందా..?

rrr movie latest update

రాజమౌళి – రామారావు – రామ్ చరణ్ కలయికలో #RRR వర్కింగ్ టైటిల్ తో బడా మల్టీస్టారర్ అంగరంగ వైభవంగా మొదలైపోయింది. రాజమౌళి దర్శకత్వం, రామారావు(ఎన్టీఆర్), రామ్ చరణ్ హీరోలు అంటే సినిమా మీద ఎలాంటి క్రేజుంటుందో మాటల్లో వర్ణనాతీతం. బాహుబలితో సృష్టించిన రికార్డులను తానే తుడిచెయ్యడానికి రాజమౌళి అన్ని సిద్ధం చేసేసుకున్నాడు. RRR ఓపెనింగ్ రోజునే హీరోయిన్స్ ని ప్రకటిస్తాడని ఎదురు చూసిన వారికీ నిరాశే మిగిలింది. కారణం రాజమౌళి ఇంకా హీరోయిన్స్ ని సెట్ చెయ్యలేదు. కానీ రాజమౌళి ఎప్పుడో హీరోయిన్స్ ని సెట్ చేసాడని, రాజమౌళి మైండ్ లో ఉన్నారని అంటారు. అసలు రాజమౌళికి కీర్తి సురేష్, కైరా అద్వానీ తప్ప మరో ఆప్షన్ లేదని కూడా అంటున్నారు.

హీరోయిన్ గా రష్మిక మందన్నా…

ఇకపోతే RRR లోకి మరో R వస్తుందనే న్యూస్ వినబడుతుంది. ముందుగా RRR లోకి R పేరుమీద అంటే రాజశేఖర్ విలన్ అన్నారు. కానీ అది క్లారిటీ లేదుగాని…. హీరోయిన్స్ విషయంలో రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ లలో ఎవరో ఒకరిని రాజమౌళి తీసుకోవచ్చేనే టాక్ నడిచినా… వారు ప్రస్తుతం క్రేజ్ లో లేరని డ్రాప్ అవుతున్నాడని అన్నారు. ఇప్పుడు RRR లోకి మరో R అంటే గీత గోవిందంతో 100 కోట్ల హిట్ అందుకున్న రష్మిక పేరుని రాజమౌళి హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న రష్మికని రామ్ చరణ్ కి జోడీగా రాజమౌళి సెట్ చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది.

ఫోటో షూట్ చేసి…

చలాకీ న‌ట‌న‌కు మారుపేరైన ర‌ష్మిక‌.. రామ్ చరణ్ పక్కన ఎలా ఉంటుందో.. ఒకసారి ఫోటో షూట్ చేసి చూడాలని రాజమౌళి భావిస్తున్నాడట. మరి సినిమా మొదలైనా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 వరకు మొదలవ్వదు. ఇక మొదటి షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మీద యాక్షన్ సన్నివేశాలే తెరకెక్కిస్తారట. ఈ లోపు రాజమౌళి తాననుకున్న హీరోయిన్స్ కి ఫోటో షూట్స్ చేసి సెట్ చేస్తాడని అంటున్నారు. రామ్ చరణ్ కి రష్మికని సెట్ చేస్తే… ఎన్టీఆర్ కి ఎవరిని తీసుకొస్తాడో రాజమౌళి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*