2.o నుండి మరో వీడియో బయటికి..!

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రోబో పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. 2.0 సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ ఒకటి లీక్ అయింది. టీజర్ క్లారిటీ లేకపోయినా ఇండియన్ స్టాండర్డ్స్ ని పెంచేలా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకో వీడియో బయటికి వచ్చింది. అయితే ఇది టీజర్ కాదు.. మేకింగ్ వీడియో.

బీబీసీ వారివేనా..?

అయితే దీన్ని లీకేజీ అనడానికి వీల్లేదు. ఈ సినిమాపై ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని వీడియో క్లిపింగ్స్ మేకర్స్ అనుమతితో బీబీసీ వారు వాడుకున్నారు. అందులో ముఖ్యంగా సుందరివే అనే సాంగ్ మేకింగ్ వీడియో వాడారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్స్ తో బిజీగా ఉన్న ఈ మూవీ నవంబర్ 29న రిలీజ్ అవుతున్నట్టు డైరెక్టర్ శంకర్ స్వయంగా ప్రకటించారు.

పోస్టర్స్ తప్ప ఏవీ విడుదల చేయరా..

అయితే ఈ వీడియోను అధికారంగా రిలీజ్ చేయలేదు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి పోస్టర్స్ తప్పితే ఏమి రిలీజ్ చేయలేదు మేకర్స్. మరి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. మేకింగ్ వీడియోస్ తో బీబీసీలో ఓ కథనం రావడం మూవీపై అంచనాల్ని ఇంకాస్త పెంచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1