ఎన్టీఆర్ లో ఏయన్నార్ పాత్ర ఎలా ఉండబోతుంది

నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా 50 గెటప్స్ లో కనిపించనున్నాడు బాలయ్య. ఆల్రెడీ మూడునాలుగు పాత్రల లుక్స్ బయటికి వచ్చాయి. ఈసినిమా ఓపెనింగ్ రోజు బాలకృష్ణ దుర్యోధనుడి గెటప్‌, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి కాషాయం గెటప్, ‘మనదేశం’లో ఎన్టీఆర్, నాగేశ్వరరావుల గెటప్స్ బయటికి వచ్చాయి. గెటప్స్ తో అంచనాలు పెంచుతున్న ఈసినిమాలో బాలయ్య ఇంకా చాలా గెటప్స్ లో కనిపించనున్నారు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రలో తన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. సినిమాలో అక్కినేని గెటప్పులు ఐదారు వున్నాయట! సినిమాలో నాగేశ్వరారావు పాత్రకు సముచిత ప్రాధాన్యం వుందని సుమంత్ చెపుతున్నాడు. 1950 నుంచి 1990 వరకూ ఎన్టీఆర్ , ఏయన్నార్ మధ్య అనుబంధాన్ని గురించి డైరెక్టర్ క్రిష్ చాలా చక్కగా చూపిస్తున్నారు. సినిమా నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్..వ్యక్తిగత జీవిత నేపథ్యంగా వచ్చేవి మరికొన్ని వున్నాయి.

తాతగారి పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉందని…క్రిష్ నాకు కథ వినిపించినప్పుడు తాతగారి పాత్రను ఇంత అద్భుతంగా రాస్తారని అసలు అనుకోలేదని సుమంత్ తెలిపాడు. అంతేకాదు తాతగారు గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు క్రిష్ నాకు చెప్పారు అని సుమంత్ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*