ఏఎన్నార్ పాత్రకి మరొకరిని వెతకాలా..?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ బయో పిక్ ని ఎలాగైనా సంక్రాతికి విడుదల చేసే ప్లాన్ లో బాలకృష్ణ, క్రిష్ లు షూటింగ్ ని నిర్విరామంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బసవతారం పాత్రకి సంబంధించిన విద్యాబాలన్ షూటింగ్ చిత్రీకరణ పూర్తవడమే కాదు.. మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసేసారు. అయితే ఈ సినిమాలో తాము ఇంకా చాలామంది నటులను ఎంపిక చెయ్యాలని.. బయట మీడియాలో విన్పించే వారిలో ఎవరినీ ఫైనల్ గా ఎంపిక చెయ్యలేదని.. తాము నటీనటులు ఎంపిక చేసిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని క్రిష్ చెప్పాడు.

తాత పాత్రలో నటించడం లేదు…

ఇక అప్పటి నుండి సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ ని, శ్రీదేవి పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు మీడియాలో వినబడం లేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా మరో ముఖ్యమైన ఏఎన్నార్ క్యారెక్టర్ కి నాగచైతన్యని క్రిష్ సంప్రదించగా… చైతు చెయ్యనని చెప్పేశాడట. అయితే క్రిష్ అక్కినేని పాత్రకి ఏఎన్నార్ కి ఇష్టమైన మనవడు సుమంత్ ని ఎంపిక చేసినట్లుగా… సుమంత్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇక అక్కినేని పాత్రకి సుమంత్ పర్ఫెక్ట్ గా సరిపోతాడని.. మీడియా కూడా ఫిక్స్ అయ్యింది. కానీ తాజాగా ఏఎన్నార్ పాత్రకి సుమంత్ కూడా చెయ్యడం లేదని తెలుస్తుంది. కారణాలు తెలియలేదు గాని… సుమంత్ ఈ సినిమా లో ఏఎన్నార్ పాత్ర చెయ్యడం లేదని ఆయన సన్నిహిత వర్గాల భోగట్టా.

ఇంకా లిస్ట్ ఫైనల్ కాలేదా..?

ఇక సుమంత్ కూడా చెయ్యకపోతే మరి ఏఎన్నార్ పాత్రకి మళ్లీ నటుడిని వెతకాల్సిన అవసరం క్రిష్, బాలకృష్ణ మీద పడింది. ఇక షూటింగ్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినా ఇప్పటివరకు కంప్లీట్ గా నటీనటుల లిస్ట్ ని క్రిష్ కంప్లీట్ చెయ్యలేకపోయాడు. మరి సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్న క్రిష్, బాలకృష్ణలు ఇంకా స్టార్ కాస్ట్ ని పూర్తి చెయ్యకపోవడమేమిటంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*