అను తన కజిన్ ని నానికి రికమెండ్ చేసిందా..?

అను ఇమ్మాన్యువల్… నాని సినిమా మజ్నుతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అసలు గోపీచంద్ ఆక్సిజెన్ అను మొదటి సినిమా అయినప్పటికీ… నానితో కలిసి నటించిన మజ్ను సినిమానే మొదటగా ప్రేక్షకుల ముందుకు రావడంతో.. ఆ మజ్ను సినిమానే ఆమె మొదటి సినిమా అయ్యింది. అయితే మజ్ను తర్వాత స్టార్స్ హీరోస్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ.. ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అవడంతో అను ఇరకాటంలో పడింది. తాజాగా ఆమె నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

నానితో టాలీవుడ్ లోకి అరంగేట్రం…

అయితే ఇప్పుడు అను ఇమ్మాన్యువల్ తన కజిన్ ని కూడా టాలీవుడ్ లోకి దింపే ఆలోచన చెయ్యడమే కాదు.. ఇప్పటికే నాని సినిమాలో అను తన కజిన్ రెబ్బా మోనికా జాన్‌ రికమెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మళ్లీ రావా ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నానికి జోడిగా అను ఇమ్మాన్యువల్ కజిన్ రెబ్బా మోనికా జాన్‌ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రెబ్బా మోనికా జాన్‌ తమిళంలో రెండు సినిమాలు, మలయాళం లో మరో రెండు సినిమాలలో నటించింది. కానీ ఇప్పుడు నాని తో నటించిన జెర్సీ సినిమా మాత్రం టాలీవుడ్ లో ఆమెకి మొదటి సినిమా అవుతుంది.

దేవదాస్ తర్వాతే సెట్స్ మీదకు…

మరి అక్కాచెల్లెళ్లు అనుకోకుండా ఇలా నానితో జోడి కట్టి మొదటగా టాలీవుడ్ లోకి హీరోయిన్స్ గా అడుగుపెడుతున్నారు. ఇకపోతే నాని – గౌతమ్ తిన్నసూరి కాంబోలో జెర్సీ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరో నాని బిగ్ బాస్ సీజన్ టూ తో, దేవదాస్ అనే మల్టీస్టారర్ సినిమాతో బిజీగా వున్నాడు. ఇక దేవదాస్ సినిమా పూర్తి కాగానే నాని జెర్సీ సినిమా సెట్స్ మీదకెళుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*