అను కి ఇప్పటికైనా అదృష్టం కలిసొస్తుందా..?

ప్రస్తుతం అను ఇమ్మాన్యువల్ కి టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ అందుకుంది. ఇద్దరు స్టార్ హీరోల పక్కన నటించిన అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. ఈ ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన ప్రాధాన్యం లేని పాత్రలో అజ్ఞాతవాసి సినిమాలో నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా భారీ ఫ్లాప్ మూటగట్టుకుంది. ఇక తర్వాత అల్లు అర్జున్ తో కలిసి నా పేరు సూర్య సినిమాలో ఫుల్ లెంత్ రోల్ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గకపోయినా… ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అమ్మడుకి చమట్లు పట్టాయి.

డైట్స్ లేవని ఉన్న అవకాశాన్ని…

నా పేరు సూర్య షూటింగ్ జరుగుతున్నప్పుడే.. నాగ చైతన్య కి జోడిగా దర్శకుడు మారుతీ శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఛాన్స్ ఇచ్చాడు. మరి ప్రస్తుతం అను ఇమ్మాన్యువల్ చేతిలో ఉన్న ఏకైక సినిమా ఈ శైలజ రెడ్డి అల్లుడే. ఈ సినిమాతో పాటుగా ఒప్పుకున్న రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా నుండి అను ఇమ్మాన్యువల్ అనూహ్యంగా తప్పుకుంది. ఏదో చేతిలో బోలెడు అవకాశాలు ఉన్నట్లుగా డేట్స్ ఖాళీ లేవని ఆ సినిమా నుండి బయటికొచ్చినట్లుగా చెప్పుకుంది. ఇకపోతే చేతిలో ఉన్న శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ కి కూతురిగా నాగ చైతన్య కి లవర్ గా అను ఇమ్మాన్యువల్ ఈ సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమానైనా కలిసివచ్చేనా…

మరి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య హగ్ తో ఫుల్ హ్యాపీ గా అను ఇమ్మాన్యువల్ కనబడుతుంది. మరి డీసెంట్ గా చీర కట్టు లుక్ లో నాగ చైతన్య కౌగిలింతతో అందంగా నలిగిపోతున్న అను ని చూస్తుంటే ఆమెకు ఈ సినిమాతో హిట్ ఖాయమనిపిస్తుంది. ఇప్పటికే శైలజ రెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా హిట్ మీదే అను అదృష్టం ఆధారపడి ఉంది. ఈ సినిమా వచ్చే నెల 31 న విడుదల కాబోతుంది. చూద్దాం అనుకి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో. ఇటు సినిమాల్లోనూ అటు పర్సనల్ లైఫ్ లోను అను ప్రస్తుతం కష్టాలు పడుతుంది..!