అను అనుకున్నదే అయ్యింది..!

మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల తర్వాత అను ఇమ్మాన్యువల్ కి ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వచ్చేసాయి. కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో పక్కన అనుకి సెకండ్ హీరోయిన్ అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి లో మొదటి హీరోయిన్ కీర్తి సురేష్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా అను ఇమ్మాన్యువల్ ని ఎంపిక చేసాడు త్రివిక్రం. అయితే పెద్ద బ్యానర్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ అని మాత్రమే ఈ సినిమా ఒప్పుకోలేదట అను ఇమ్మాన్యువల్. ఆ సినిమా కథ విన్న తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ని అను ఒక విషయాన్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుందట.

మంచి పాత్ర దక్కినా…

తన పాత్రని అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీతలా చెయ్యరు కదా అని అడగగా… అలాంటిదేం లేదు.. నీ పాత్ర ఈ సినిమాలో బాగుంటుందని చెప్పాడట మాటల మాంత్రికుడు. ఆ నమ్మకంతోనే అను అజ్ఞాతవాసిలో నటించిందట. మరి నిజంగా అను అనుకున్నట్టే ప్రణీతకు ఇచ్చినట్లుగా డమ్మీ క్యారెక్టర్ లో నటించినట్టే.. అజ్ఞాతవాసిలో అను ఇమ్మాన్యువల్ హీరో పవన్ కోసం కీర్తి సురేష్ తో పోటీగా మంచి క్యారెక్టర్ లో నటించింది. మరి ఆ సినిమా డిజాస్టర్ కావడం.. ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడంతో అనుకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది.

శైలజారెడ్డిపైనే ఆశలు…

ఇక నా పేరు సూర్య కూడా ప్లాప్ అవడం.. నా పేరు సూర్య కోసం గీత గోవిందం లాంటి హిట్ సినిమా వదులుకున్న అను ఇమ్మాన్యువల్ ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫలితం కోసం వెయిట్ చేస్తుంది. కొన్ని అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ వినాయక చవితికి విడుదల కాబోతుంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అను ఇమ్మాన్యువల్ తన కెరీర్ గురించి.. కెరీర్ లో ప్లాప్ ల గురించి మీడియాతో ముచ్చటించింది. ఇక శైలజారెడ్డి అల్లుడు హిట్ అనుకి చాలా ముఖ్యం. ఆ సినిమా హిట్ అయితేనే అనుకి మళ్లీ టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*