అను అదృష్టం ఎలా ఉందో.?

anu emmanuel next movies

ప్రస్తుతం టాలీవుడ్ లో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చేసింది. టాప్ రేంజ్ లో ఉన్న సీనియర్ హీరోయిన్స్ హవా ముగిసిపోయి.. కొత్త హీరోయిన్స్ హావా మొదలైపోయింది. తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ హవా ముగిసిపోయినట్టే. సమంత ఇంకా అనేక సినిమాల్తో ఇప్పటికి బిజీ తారాగానే ఉంది. కానీ సమంత కూడా తనకి నచ్చిన పాత్రలనే చేస్తానని చెప్పేసింది. అలాంటి టైం లోనే డీజే సినిమాతో బులెట్ లా దూసుకొచ్చింది పూజ హెగ్డే. ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ సినిమాలతో ఒక్కసారిగా బిజీగా మారిపోయింది పూజ హెగ్డే. ఇప్పుడు భరత్ అనే నేను తో కియారా అద్వానీ కూడా బిజీగా మారిపోయింది. మహేష్ తర్వాత వెంటనే రామ్ చరణ్ తో కల్సి బోయపాటి సినిమాలో నటిస్తుంది.

అలా వారిద్దరూ బిజీ తరాలుగా మరో రెండేళ్ల పాటు చక్రం తిప్పేస్తారు. అయితే మరో తార కూడా వీరిలాగే బిజీగా మారె అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. మజ్ను సినిమాతో ఇండస్ట్రీలో కొచ్చిన గ్లామర్ డాల్ అను ఇమ్మాన్యువల్ కూడా అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ కాకపోతే బిజీగా ఉండేదే. కానీ అజ్ఞాతవాసి ప్లాప్ అమ్మడు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. లేదంటే అజ్ఞాతవాసి గనక హిట్ అయితే రామ్ చరణ్ – బోయపాటి సినిమాతో పాటుగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలోనూ అను ఇమాన్యువల్ హీరోయిన్ అయ్యేది. కానీ ఒకే ఒక్క ప్లాప్ అమ్మడు జీవితాన్ని తల్లకిందులు చేసింది.

అయితే ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాలో అను అందాల ఆరబోతతో మళ్ళీ బిజీ తారగా మారె అవకాశం లేకపోలేదు. నా పేరు సూర్య లో అను ఇమ్మాన్యువల్ గ్లామర్ షో తో అందాల ఆరబోతతో ఒక లెవల్లో రెచ్చిపోయింది. ఇప్పటికే నా పేరు సూర్య రొమాంటిక్ పోస్టర్స్ తో పాటు సాంగ్ ప్రోమోస్ లో కూడా అను అందాల విందు మాములుగా లేదు. మరి నా పేరు సూర్య హిట్ అయితే అందరికన్నా ఎక్కువగా లాభ పాడేది మాత్రం అను ఇమ్మాన్యువేలే. ఆ సినిమా హిట్ తో అమ్మడుకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావొచ్చు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలెవరు కొత్త సినిమాలు చేసేలా లేరు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ హీరోయిన్స్ తో సహా పట్టాలెక్కేశాయి. చూద్దాం అను అదృష్టం ఎలా ఉందొ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*