క్రేజ్ లేదని ..గెస్ట్ రోల్ ఒప్పేసుకుందా ?

ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితి ఏం బాగోలేదు. మెగా హీరోలతో వరసబెట్టి సినిమాలు చేసిన అనుకి పవన్ కళ్యాణ్ తో నటించిన అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నటించిన నా పేరు సూర్యలు డిజాస్టర్స్ కావడంతో లక్కు మొత్తం పోయింది. ఇక నా పేరు సూర్య తర్వాత అనుకి చేతిలో మిగిలింది మారుతి – నాగ చైతన్యల శైలజ రెడ్డి అల్లుడు మాత్రమే. తాజాగా అమ్మడు కారణమేమిటో తెలియదు గాని రవితేజ – శ్రీను వైట్ల అమర్ అక్బర్ ఆంటోని సినిమా నుండి కూడా బయటికి వచ్చేసింది. ఇక కేవలం శైలజ రెడ్డి అల్లుడు సినిమా సక్సెస్ తోనే అనుకి టాలీవుడ్ లో ఉండే అవకాశం ఉంటుంది.

గెస్ట్ రోల్ కి ఓకే అనేసింది…

అయితే తనకి క్రేజ్ తగ్గిపోయిందని భావించిన అను ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు గెస్ట్ రోల్స్ కి సైతం ఒకే చెప్పేస్తుందట. తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన అను ఇప్పుడు ఒక యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రకి సై అన్నదనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ కొట్టేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ ఒక సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఒక గెస్టు రోల్ కి  ప్రేక్షకులకు బాగా పరిచయమున్న హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి అనూ ఇమ్మాన్యుయేల్ ను సంప్రదిస్తే ఆమె వెంటనే ఓకే చెప్పేసిందట.

విజయ్ క్రేజు కోసమేనా..?

మరి అనూ ఇలా గెస్ట్ రోల్ కి ఒప్పుకోవడానికి కారణం ఏమిటో అందరూ ఇట్టే పసిగట్టేయ్యగలరు. ప్రస్తుతం చేతిలో ఆఫర్స్ లేవు. ఇలాంటి సమయంలో అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకులే అనుకుందేమో అందుకే ఈ పాత్రని ఒప్పేసుకుంది. అలాగే విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్, బ్యానర్ గీత ఆర్ట్స్ కున్న పేరుని దృష్టిలో పెట్టుకుని కూడా అనూ ఇలా అతిథి పాత్రకి ఓకె చెప్పేసిందేమో. మరి అలాంటి పేరున్న వారితో సినిమాలో ఏదో ఒక పాత్రలో మెరిస్తే తర్వాత తనకి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని భావించి ఒప్పేసుకుని ఉంటుంది.. కదా..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*