ఆక్సిడెంట్లు ఆమెకు అచ్చి రావడం లేదు..!

‘అ..ఆ’, ‘ప్రేమమ్’ సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ స్టార్టింగ్ లో పర్లేదు అనిపించుకున్న ఆ తర్వాత వరసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను అందుకుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రంతో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ‘ఉన్నది ఒకటే ఒకటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘తేజ్ ఐ లవ్ యూల’తో వరసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమెకు కొంచెం భయం పట్టుకుంది.

రెండు సినిమాల్లోనూ ఆక్సిడెంట్లు

అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే… ‘ఉన్నది ఒకటే జిందగీ’లో ఆక్సిడెంట్ లో చనిపోయే పాత్ర చేసిన అనుపమ ‘తేజ్ ఐ లవ్ యు’లో అచ్చం అలాంటి ఆక్సిడెంట్ కు గురై గతమంతా మర్చిపోతుంది. ఈ రెండు పాత్రలు అదేవిధంగా ఉండటం.. సరిగా ఇంటర్వెల్ బ్లాక్ లో ఆ రెండు పాత్రలు రావడం చూస్తుంటే ఆమెకు ఆక్సిడెంట్లు కు అచ్చి రావడం లేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ సినిమానే కీలకం…

రామ్, నాని, తేజ్ వంటి యంగ్ హీరోలతో నటించినప్పటికీ ఆమెకు డిజాస్టర్స్ రావడం తనను ఎక్కువ బాధ పెడుతోంది. ప్రస్తుతం ఆమెకు రామ్ తో నటిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం కీలకం కానుంది. ఈ సినిమాను ‘నేను లోకల్’, ‘సినిమా చూపిస్తా మావా’, ‘మేం వయసుకు వచ్చాము’ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తీసిన త్రినాథ రావు దర్శకుడు. ఈ సినిమాలో ఆమెకు ఎలాంటి ఆక్సిడెంట్ లేకండా చూడమని కోరుతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది.