కెరీర్ లో బెస్ట్ మిస్ అయ్యింది

anasuya telugu post telugu news

రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ పాత్రకి ఎంతగా పేరొచ్చిందో.. పల్లెటూరి అమ్మాయిలా…. పొలం పనులు చేసుకునే రామలక్ష్మి సమంత పాత్రకి అంతే పేరొచ్చింది. సమంత కెరీర్ లోనే రామలక్ష్మిగా కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వడమే కాదు… ఆ పాత్ర సమంత కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. డి గ్లామర్ గా, లంగావోణీ లో సమంత లుక్స్ అండ్ నటన కూడా అదుర్స్. ఇక రంగమ్మ, మంగమ్మ సాంగ్ లో అయితే సమంత రెచ్చిపోయి డాన్స్ చేసి అందరి హృదయాల్లో నిలిచిపోయింది. మరి అలంటి పాత్రలను ఏ హీరోయిన్ కూడా మిస్ చేసుకోదు. ఈవెన్ అలాంటి పాత్రల కోసం హీరియిన్స్ ఎంతో ఎదురు చూస్తారు.

అలాంటిది రంగస్థలంలో రామలక్ష్మి రోల్ ని ఒక అందమైన హీరోయిన్ మిస్ చేసుకుంది. ఆమె ఎవరో కాదు… శతమానంభవతి, ఉన్నది ఒకటే జిందగీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ లో కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరుస్తున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అనుపమ రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం ముందుగా తననే సంప్రదించారనే విషయం బయటపెట్టింది. అయితే గతంలోనే రామ్ చరణ్ పక్కన అనుపమ ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయబోతోందని… కానీ తర్వాత అనుపమ చెయ్యడం లేదనే న్యూస్ ప్రచారం జరిగింది.

తాజాగా అనుపమ చెప్పిన దాని బట్టి నిజంగానే చరణ్ పక్కన అనుపమ రామలక్ష్మి పాత్ర చెయ్యాల్సింది. కానీ కొన్ని కారణాల వలన తాను చేయలేకపోయానని.. కానీ తనకన్నా సమంత రామలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పింది. ఇక ఆ సినిమా చూసాకా.. నాకన్నా.. సమంత నే ఆ పాత్రకి దర్శక నిర్మాతలు తీసుకోవడం కరెక్ట్ అనిపించిందని కూడా చెప్పింది. అలాగే అదే విషయాన్నీ తాను సుకుమార్ కి కూడా చెప్పానని చెబుతుంది అనుపమ. ఇక అనుపమ అభిమానులు మాత్రం పాపం అనుపమ కెరీర్ బెస్ట్ మిస్ అయ్యిందని తెగ ఇదైపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*