అనుష్క కొంచం స్లిమ్ అయింది..!

Anushka with Madhavan in Kona venkat film

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ వచ్చిన అనుష్క శెట్టికి ఉండే ఫాలోయింగ్ వేరు. అందరితో కంపేర్ చేసుకుంటే.. ఆమె లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేసి తన యాక్టింగ్ స్కిల్స్, అందంతో జనాలను థియేటర్స్ కు రప్పించడంలో అనుష్క రూటే వేరు. అందుకే ఆమెకు అంతలా ఫ్యాన్స్ ఉంటారు.

వర్కవుట్స్ లో బిజీగా…

‘భాగమతి’ సినిమా తర్వాత ఈమె పెద్దగా ఎక్కడ కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం ఆమె ఓ రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇది ఇలా ఉంటె ఈ మధ్య అనుష్క ఏ ఈవెంట్ లోనూ అంతగా కనపడట్లేదు. ‘సైజ్ జీరో’ సినిమా కోసం పెరిగిన బరువు తగ్గించేందుకు వర్క్ అవుట్స్ చేస్తుందని టాక్.

గ్లామర్ మరింత పెంచింది…

లేటెస్ట్ గా ఆమె మరో బెంగళూరు బ్యూటీ ప్రణీతతో ఎయిర్ పోర్ట్ లో కలిసి ఫోటో దిగడం జరిగింది. ఇందులో అనుష్కను చూస్తే ఫేస్ లో మాత్రం కాస్త మార్పు వచినట్టే కనిపిస్తుంది. అంతే కాదు ఫేస్ లో గ్లో పెరిగినట్టుగా, కాస్త స్లిమ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక ప్రణీత విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి తెలుగులో ‘హలో గురూ ప్రేమ కోసమే’ ఇంకోటి ‘లుసిఫెర్’ అనే మలయాళం సినిమాలో చేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*