అరవింద సమేత డైలాగ్ నెట్ లో హల్ చల్.?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా గత ఏడాదే ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏప్రిల్ నుంచే మొదలైంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టినప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ కి ఎటువంటి బ్రేక్ వెయ్యకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్ అరవింద సమేత ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై మంచి స్పందన మూటగట్టుకుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

రాయలసీమ యాసలో అదరగొట్టాడు…

అయితే ఇప్పుడు అరవింద సమేత సినిమాకి సంబంధించిన ఒక డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెప్పే ఆ డైలాగ్ మాస్ ప్రేక్షకులను మైమరపించడం ఖాయంలా కనబడుతుంది. ఎన్టీఆర్ తనదైన స్టైల్లో ‘అన్నా.. మాది రాయల సీమ.. నమ్మితే ప్రాణాలు ఇస్తాం.. నమ్మక ద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం’ అంటూ చెప్పే ఈ డైలాగ్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది. ఇక ఈ పవర్ ఫుల్ డైలాగ్ అరవింద సమేత – వీర రాఘవకి హైలెట్ గా ఉంటుందంటున్నారు యూనిట్ సభ్యులు. ఇప్పటికే షూటింగ్ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ ని కూడా చివరిదశకు తీసుకొచ్చారు.