త్రివిక్రమ్ రెండు సినిమాలకు అదే కామన్ పాయింటా..?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ‘అరవింద సమేత’ కు మహేష్ బాబు ‘అతడు’ ఓ కామన్ పోలిక ఉంది. అది ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో కమెడియన్ గా సునీల్ నటించాడు. అంతేకాదు ‘అరవింద సమేత’ సునీల్ పాత్ర అచ్చం ‘అతడు’లో ఉన్నట్టు ఉంటుందని సునీల్ చెప్పాడు. రీసెంట్ గా అతను లీడ్ పాత్రలో నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ ప్రొమోషన్స్ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న చాలామంది అడిగారు నన్ను..”సింపుల్ గా చెప్పాలంటే అతడు లో నా పాత్ర ఎలా ఉంటుందో అచ్చం అలానే ఈ సినిమాలో ఉంటుందని” చెప్పాడు.  ‘సిల్లీ ఫెలోస్‌’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

లాజిక్ గురించి ఆలోచించొద్దు…

‘సిల్లీ ఫెల్లోస్‌’లో తన పాత్ర ‘సొంతం’, ‘ఆడుతూ పాడుతూ’ సినిమాల్లోని పాత్రల తరహాలో ఉంటుందని చెప్పారు. ఈ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు లాజిక్కుల గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే.. కామెడీ మేజిక్‌ని ఎంజాయ్‌ చేయవచ్చని చెబుతున్నాడు. సునీల్. రవి తేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కూడా కమెడియన్ గా నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*