మరోసారి ఎన్టీఆర్ తో కాజల్!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. లేటెస్ట్ గా ఈ మూవీకు సంబంధించి ఓ మోషన్ టీజర్ కూడా రిలీజ్ చేయగా అందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో కనిపించాడు. ఎన్టీఆర్ కి జోడిగా పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఐటమ్ సాంగ్ లో కాజల్.?

ఇది యాక్షన్ తో కూడిన ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసిరల్లో కొంపల్లి దగ్గర షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మరోసారి కాజల్ ని తీసుకోనున్నారని లేటెస్ట్ న్యూస్. గతంలో ‘జనతా గ్యారేజ్’ లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో అదరగొట్టిందో తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాలో ఈ పాట యూత్ తో పాటు.. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పక్క లోకల్ సాంగ్ కన్న ఈ సాంగ్ ఇంకా హైలైట్ అవుతుందని టీం నమ్ముతుంది. షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని దసరాకి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*