అతిథులు రాకపోయినా… హడావిడి ఖాయం..!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సామెత వీర రాఘవ సినిమా హడావిడి మొదలైపోయింది. మరో పదిహేను రోజుల్లో విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా ఎన్టీఆర్ మాస్ గా కనబడనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోస్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల మధ్యన ఉన్న అనుబంధం మాటల్లో చెప్పడం కష్టమనేలా ఉంది. ఒక హీరోకి, డైరెక్టర్ కి ఉండాల్సిన సంబంధం కాదది. ఇద్దరి స్నేహితుల మధ్యన ఉన్న అనుబంధం గా కనబడుతుంది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..?

అయితే అరవింద సమేత పాటలను ఎలాంటి హడావిడి లేకుండా మార్కెట్ లోకి వదిలిన అరవింద టీం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తుందట. హరికృష్ణ మరణంతో ఒక్కటయిన నందమూరి కుటుంబం.. అందులోనూ ఎన్టీఆర్ బాబాయ్ హీరో బాలకృష్ణ ఈ అరవింద ఆడియో వేదిక మీద మెరవబోతున్నాడనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. అక్టోబరు 2న హైద‌రాబాద్‌లో అరవింద సామెత ప్రీ రిలీజ్ వేడుక చేయాల‌ని ముందుగా అరవింద నిర్మాతలు నిర్ణ‌యించుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అరవింద ప్రీ రిలీజ్ డేట్ మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 3న‌ గానీ, 6న గానీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వేడుక నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యేట్లుగా కనబడుతుంది బయట వ్యవహారం. ఎందుకంటే త్రివిక్రమ్ తో పాటు చిత్ర బృందం ఇటలీలో ఓ సాంగ్ షూట్ కోసం వెళ్లారు. అయితే వాళ్లు హైదరాబాద్ చేరుకున్న తర్వాత అరవింద సమేత ఆడియో వేడుకని ఓ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారట.

అతిథులు రాకపోయినా…

అరవింద సామెత ఆడియో వేడుకకి బాలకృష్ణ రావడం అనేది ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్న వ్యవహారమే అయినప్పటికీ.. ఈవెంట్ ని హెచ్ఐసిసిలో చాలా భారీగా చేయాలని ప్లానింగ్ చేస్తున్నారట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిధులుగా ఎవరూ రాకపోయినా.. ఈ వేడుకని ఎన్టీఆర్, త్రివిక్రమ్ లే భుజాన వేసుకుని నందమూరి ఫాన్స్ లో ఉత్సహం నింపాలని భవిస్తున్నారట. ఇప్పటికే హరికృష్ణ మరణంతో కాస్త దిగులుతో ఉన్న నందమూరి ఫాన్స్ అరవింద ప్రీ రిలీజ్ వేడుకని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే రీతిలో ఈ వేడుకని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*