అరవిందకు భలే కలిసొచ్చిందిగా!!

దసరా కానుకగా రిలీజ్ అయినా ‘అరవింద సమేత’ మొదటి రోజు టాక్ బట్టి చూస్తే ఇది నాన్ ‘బాహుబలి’ పై ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తుందని అందరు అనుకున్నారు. అలానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వీకెండ్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అనూహ్య స్థాయిలో వచ్చింది. అయితే ఆ తర్వాత ఈచిత్రం అనుకున్న స్థాయిలో పెర్ ఫామ్ చేయలేకపోయింది. ముఖ్యంగా తొలి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ బాగా డల్ అయ్యాయి.

తొలి వారం మాత్రం…..

తొలివారం ఈచిత్రం 70 కోట్లు దాకా వసూల్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఈసినిమా 100 కోట్లు క్లబ్ లోకి వెళ్ళటం కష్టం అని అంటున్నారు ట్రేడ్ వారు. అసలు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా కష్టమే అని అంటున్నారు. దానికి తోడు ఈవారం అంటే నిన్న ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా విడుదల అయింది. దీనిపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో ఈసినిమా లేదు.

వాటికి నెగిటివ్ టాక్ రావడంతో…..

ఏదో అలా టైంపాస్ అయిపోయే సినిమానే తప్ప.. అంత ప్రత్యేకమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. ఈసినిమాతో పాటు విశాల్ ‘పందెంకోడి-2’ రిలీజ్ అయింది. ఇది తెలుగులో డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇలా ఈరెండు సినిమాలకి నెగటివ్ టాక్ రావడంతో ‘అరవింద సమేత’కు కలిసొచ్చే అవకాశముంది. ఈ వీకెండ్ లో ఈచిత్రాన్ని ఆక్యుపెన్సీ రేట్ బాగానే ఉంటుందని భావిస్తున్నారు ట్రేడ్. దాంతో 100 కోట్లు వసూలు చేయకపోయినా కనీసం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*