పూజ కోసం కాలేజ్ కి వెళుతున్న హీరో?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత – వీర రాఘవ సినిమా షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ అనేదే లేకుండా ఈ సినిమా షూటింగ్ ని త్రివిక్రమ్ పరిగెత్తిస్తున్నాడు. అరవింద గా హాట్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ అండ్ క్లాస్ స్టయిల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే మాస్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ అందరిని ఆకర్షించింది. ఇక రెండో హీరోయిన్ గా ఈషా రెబ్బ నటిస్తున్న ఈ సినిమా లో నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా.. జగపతి బాబు విలన్ గా ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ బ్యాగ్డ్రాప్ లోనే ఉండబోతుంది.

ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పొల్లాచ్చి వెళ్లబోతుంది. ఇప్పటికే హీరో హీరోయిన్స్ మధ్యన సీన్స్ ని తెరకెక్కించిన త్రివిక్రమ్… ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాలను అంతే ఫాస్ట్ గా పూర్తి చేసాడు. ఇక పాటల చిత్రీకరణకు మాత్రం అరవింద సామెత టీమ్ మొత్తం పొల్లాచ్చి వెళ్లబోతుందట. అలాగే ఇప్పుడు మరో షెడ్యూల్ లో ఎన్టీఆర్ – పూజ హెగ్డే ల మీద కాలేజ్ సీన్స్ ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ కాలేజ్ సీన్స్ తో పాటుగా పొల్లాచ్చి షెడ్యూల్ లో హీరో హీరోయిన్స్ మీద పాటలతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలను కూడా త్రివిక్రమ్ చిత్రీకరించనున్నాడట.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక అరవింద సమెత టీజర్ ని ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తునాన్రు. మరి సినిమాని కూడా దసరా బరిలో దింపే యోచనలో అరవింద సమేత మూవీ యూనిట్ ఉన్నట్లుగా తెలిసిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*