అరవింద సమేత లో సీనియర్ హీరోయిన్ లేనట్టేనా..?

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారి తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడులో దూసుకుపోతుంది. ఇప్పటికే అరవింద సమేత షూటింగ్ దాదాపుగా మూడొంతులు పూర్తయిందని టాక్ వినబడుతుంది. గత ఏడాది నవంబర్ లో పూజ కార్యక్రమాలు చేపట్టిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు ఈ ఏడాది ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజ హెగ్డే, ఈషా రెబ్బలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్కి తండ్రిగా మెగా హీరో నాగబాకు నటిస్తుండగా.. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు ఒక గ్రామ సర్పంచ్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

సీనియర్ హీరోయిన్ల సెంటిమెంట్

ఇకపోతే త్రివిక్రమ్ తెరకెక్కించిన చాలా సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ హడావిడి ఉండేది. గతంలో హీరోయిన్స్ గా చేసిన మాజీ హీరోయిన్స్ ని తన సినిమాల్లో కీలకపాత్రను ఎంపిక చేసుకుని…వారిని ఆ సినిమా లో ప్రధాన ఆకర్షణగా చూపెడుతుంటాడు. అలా సీనియర్ నటీమణులను తీసుకున్న వాటిలో అత్తారింటికి దారేది సూపర్ హిట్ కాగా.. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అత్తారింటికి దారేది లో నదియాని మెయిన్ క్యారెక్టర్ గా తీసుకున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసిలో తమిళ సీనియర్ హీరోయిన్ ఖుష్బూని తీసుకొచ్చాడు. మరి ఇపుడు అరవింద సమేత కోసం కూడా త్రివిక్రమ్ ఒక సీనియర్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్లుగా గట్టిగానే ప్రచారం జరిగింది.

రంభ వస్తుందనగా…

మొదట్లో మీనా, రంభ పేర్లు బాగా వినబడ్డాయి. ఇక రంభ ఏకంగా అరవింద సమేత సెట్స్ మీదకెళుతుందన్న టైం లో రంభ గర్భవతి కావడం వలన ఆ ప్లేస్ లోకి మరో సీనియర్ హీరోయిన్ వేట మొదలైందన్నారు. మరి సినిమా మూడొంతుల షూటింగ్ పూర్తయినా ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్ విషయం తేలలేదు. అంటే అందరూ అనుకున్నట్లుగా అరవింద సమేతలో అసలు సీనియర్ పాత్ర లేదా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పాత్ర విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక సినిమా షూటింగ్ మూడొంతులు పూర్తయ్యి మిగతా షూటింగ్ భాగం కూడా సెప్టెంబర్ 15 కల్లా పూర్తికావాలని డెడ్ లైన్ అరవింద సమేత టీమ్ పెట్టుకుంది. మారి ఆ లెక్కన సీనియర్ హీరోయిన్ పాత్ర ఇక లేనట్లేనని ఫిక్స్ అవ్వాలా..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*