ఒకే వేదికపై బాబాయ్…అబ్బాయ్….!!

ntr may attend ntr audio function telugu post telugu news

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత – వీర రాఘవ భారీ అంచనాల నడుమ దసరా కానుకగా ఈ నెల 11న విడుదలైంది. సినిమాకి మొదట్లో తేడా టాకొచ్చినా… చివరికి సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యింది. అయితే అరవింద సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పటికీ… ఎన్టీఆర్ ఆత్మస్థయిర్యంతో షూటింగ్ కంప్లీట్ చేసి మరీ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేసాడు. ఇక హరికృష్ణ చనిపోయిన టైంలోనే నందమూరి ఫ్యామిలి బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని దగ్గరికి తియ్యడంతో ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యారనే భావన అందరిలో కలగడం.. అరవింద సమేత ప్రమోషన్స్ లో బాలకృష్ణ పాలుపంచుకుంటాడనే ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉండి అరవింద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయాడు.

త్రివిక్రమ్…ఎన్టీఆర్ కలసి……

ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలిసి అరవింద సమేత ప్రమోషన్స్ ని చేశారు. అలాగే సినిమా విడుదలయ్యాక కూడా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లు కలిసి సినిమాని ప్రమోట్ చేస్తూ పోయారు. సక్సెస్ మీట్ అంటూ హడావిడి చేశారు. ఇక అరవింద సమేత కలెక్షన్స్ పరంగా బావుండడంతో.. అరవింద సమేత విజయోత్సవ సభ ని అక్టోబర్ 21న అనగా రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నామని అరవింద నిర్మాతలు హారిక అండ్ హాసిని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విజయోత్సవ వేడుకని ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరవవుతున్నారని ఎన్టీఆర్ పర్సనల్ పీఆర్వో మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ఒకే వేదికపై……

ఇక ఒకే వేదిక మీద ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ లను చూసే నందమూరి అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుండవంటే నమ్మాలి. ఇక ఈ వేడుకలో హీరోయిన్స్ పూజ హెగ్డే, ఈషా రెబ్బ తోపాటుగా జగపతి బాబు, త్రివిక్రమ్ కూడా హాజరవుతారని చెబుతున్నారు. మరి అరవింద సమేత హిట్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటుంటే ఇప్పుడు అరవింద విజయోత్సవ సభకి బాలకృష్ణ రావడంతో ఆ పండగ మరింత వెలుగు జిమ్ముతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*