అరవింద విషయంలో ఓ బ్యాడ్ న్యూస్..!!

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా నుండి ఓ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే..ఈనెల 20న ఈసినిమా ఆడియో లాంచ్ జరగాల్సివుంది. కానీ తాజా అప్ డేట్ ప్రకారం ఇది కాన్సిల్ అయిందని తెలుస్తుంది. సాంగ్స్ అన్ని డైరెక్ట్ గా ఆన్ లైన్ లోకి వచ్చేస్తాయి అంట. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ కు ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.

ప్రీరిలీజ్ ఫంక్షన్ మాత్రం…..

ఇది ఇలా ఉంటె..ఈనెల 20న ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్టోబర్ స్టార్టింగ్ లో జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. రాయలసీమలో కానీ, ఇటు ఆంధ్రలో కానీ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జరపాలనుకుంటున్న మేకర్స్. దానికి సంబంధించి వేదిక త్వరలోనే తెలియజేయనున్నారు. అయితే మరో ఇంట్రెసింగ్ న్యూస్ ఏటంటే…ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటు బాలయ్య బాబు, ఇటు చంధ్రబాబు కూడా హాజరవవుతారని గట్టి సమాచారం.

డిస్కషన్ లోనే…..

అక్టోబర్ 1 నుంచి 10లోపు డేట్స్ మధ్యలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయాలనీ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ అన్నది డిస్కషన్ లో వుంది. చాలాకాలం తరువాత ఎన్టీఆర్-బాలయ్య-చంద్రబాబు ఓ వేదిక మీదకు రావడం అనేది నందమూరి ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త. కచ్చితంగా ఓ అపూర్వమైన కార్యక్రమంలా వుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*