బాలీవుడ్ లో సర్వసాధారణమైంది

ఈమధ్యన బాలీవుడ్ హీరోయిన్స్ అంతా పెళ్ళికి సిద్ధపడిపోతున్నారు. పెళ్లి వయసు దాటిపోయినా పెళ్లి ఊసెత్తని భామలు ఇప్పుడు పెళ్లికోసం ఆరాటపడుతున్నారు. దీపికా పదుకొనే, రణ్వీర్ లు ప్రేమించి పెళ్ళాడుతున్నాడు. నవంబర్ 14, 15 తేదీల్లో వారి పెళ్లి జరగబోతుంది. ఇక మరో హాట్ సుందరి ప్రియాంక చోప్రా అయితే తనకన్నా చిన్నవాడు ఏకంగా పదేళ్ల చిన్నవాడైన నిక్ ని ప్రేమించి పెళ్లాడుతుంది. ఎప్పటి నుండో ప్రేమాయణం సాగిస్తున్న ప్రియాంక ఫైనల్ గా డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కబోతుంది. మరి అంతమంది మగ వాళ్లలో ఎవ్వరూ నచ్చక తన కన్నా చిన్నవాడి మీద మనసు పారేసుకుని పెళ్ళికి సిద్ధమైంది ప్రియాంక. అలాగే మరో బాలీవుడ్ ఆంటీ మలైకా అరోరా అయితే అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.

అన్ని ఉన్నా అర్జున్ కపూర్ కి ఏం తక్కువో.. పెళ్ళై తనంత పిల్లాడున్నా మలైకా వెంట పడుతున్నాడు. అర్భాజ్ ఖాన్ కి విడాకులిచ్చి మరీ అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది మలైకా. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ జంట మీద హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మలైకా ని అర్జున్ కపూర్ పెళ్లాడుతాడనే టాక్ నడుస్తుంది. మరి హాట్ ఆంటీ మలైకా అంటే అర్జున్ కపూర్ పడి చచ్చిపోతున్నాడు. ఇక ఇప్పుడు విశ్వసుందరిగా ఒక వెలుగు వెలిగిన సుష్మిత కూడా తనకన్నా 15 ఏళ్ళ చిన్నవాడితో ప్రేమాయణం నడుపుతుంది.

ఏ పార్టీలో చూసినా సుష్మిత సేన్ తో పాటుగా ఆమె బాయ్ ఫ్రెండ్ కనబడుతున్నాడు. సుష్మిత కన్నా వయసులో 15 ఏళ్ల చిన్నవాడైన రోమన్ షాల్ అనే మోడల్‌తో సుష్మిత డేటింగ్ లో ఉంది. మరి ఎప్పటినుండో రూమర్ గా ఉన్న ఈ న్యూస్ ని ఇప్పుడు సుష్మితనే కంఫర్మ్ చేసింది. సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న పిక్ షేర్ చేసి.. ఇది ఒరిజినల్లే.. నేను.. షాల్.. ప్రేమలో వున్నాం అంటూ కథ చెప్పేసింది. మరి హాట్ ఆంటీలంతా ఈ కుర్రాళ్లలో ఏం చూసి పడుతున్నారో అనేది పక్కన పెడితే…. తమ కన్నా పదేళ్ల పెద్దవాళ్ళయిన హాట్ అంటీలంటే ఈ కుర్రాళ్ళు ఎందుకు పడి చచ్చిపోతున్నారో అనేది చాలామందికి అర్ధం కానీ ప్రశ్నే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*