ఏం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు!

telugu post telugu news

అర్జున్ రెడ్డి సినిమాతో పక్కా యాటిట్యూడ్ చూపిస్తున్న విజయ్ దేవరకొండ అందరు హీరోల మాదిరిగా అణుకువగా ఉండడం లేదు. తనేం అనుకుంటున్నాడో అది చెప్పేయడమే కాదు.. చేసి చూపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత మాటల స్టయిల్ తో పాటు డ్రెస్సింగ్ స్టయిల్ ని కూడా చేంజ్ చేసేసాడు. ఒక రౌడీ మాదిరి బిహేవ్ చేస్తున్నాడనుకోవచ్చు. అందుకే తన ఫాన్స్ ని కూడా రౌడీస్ మాదిరి తయారు చెయ్యడానికే రౌడీ యాప్ ని విడుదల చేసాడు. ఇక స్పెషల్ డ్రెస్సులతో విజయ్ దేవరకొండ యూత్ కి స్పెషల్ ఐకాన్ గా మరిపోయాడు. నిన్నటికి నిన్న గీత గోవిందం ఆడియో వేడుకకి గళ్ల లుంగీతో వచ్చాడు. ఇక ఈ ఆడియో లో విజయ్ దేవరకొండ మాట తీరు అన్ని స్పెషల్ గా ఆకట్టుకున్నాయి. అక్కడికి స్పెషల్ గెస్ట్ గా గీత ఆర్ట్స్ వారు అల్లు అర్జున్ ని పిలిస్తే.. అల్లు అర్జున్ సూటు బూటుతో స్టార్ హీరో రేంజ్ లో హాజరైతే విజయ్ మాత్రం ఇలా లుంగి కట్టుతో అందరి చూపు తిప్పేసుకున్నాడు. మరి విజయ్ దేవరకొండ పక్కన అల్లు అర్జున్ కూడా తేలిపోయాడంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎంతగా ముదిరిందో తెలుస్తుంది.

తాను పాడిన పాటపై విమర్శలతో

ఇక సోషల్ మీడియాలో ఈమధ్యన తమకి నచ్చకపోతే హీరో హీరోయిన్స్ మీద తెగ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్లు. అయితే ఎంతగా ట్రోలింగ్ జరిగినా కొంతమంది హీరోలు, హీరోయిన్స్ కూడా గమ్మునుంటారు. కానీ విజయ్ మాత్రం తనని ట్రోల్ చేసినవారికి వెరైటీ సమాధానం ఇచ్చాడు. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ఈ మధ్య సొంతంగా ఓ పాట పాడాడు యూత్ కోసం. అయితే తను పాడిన వాట్ ది ఫా మీద తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులోని లిరిక్స్ మీద నెటిజెన్లు విజయ్ ని టార్గెట్ చేస్తూ విపరీతమైన ట్రోల్స్ చేశారు. 24 గంటలలోపు ఇవి ట్రెండింగ్ గా మారడం చూసి అందరు ఆశ్చర్యపోయారు. దెబ్బకి యూట్యూబ్ నుండి విజయ్ పడిన పాట తొలగించారు.

నేనూ వదిలిపెట్టాను…

ఆ విషయమై ఆడియో వేడుకలో విజయ్ మాట్లాడడమే కాదు.. తనని ట్రోల్ చేసిన క్లిప్పింగ్స్ ని ఆడియో వేడుక తెరపై వేసి చూపించాడు. పాట యూత్ కి కనెక్ట్ అయ్యి అందరూ మెచ్చుతారు అనుకుంటే ఒక్క రోజులో తనని అందరూ ఆడుకున్నారని, ఇక్కడ చూపించింది శాంపిల్ మాత్రమే అని ఇంకా లెక్కలేనన్ని తమ వాళ్ల దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఇక తన కన్నా బాగా పాడితే వారు పాడిన పాటనే సినిమాలో చూపిస్తామని ఒక వేళ ఆ పాట బాగా లేకపొతే తాను కూడా ట్రోల్ చేస్తానని చెప్పడం చూస్తుంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కి యూత్ ఇందుకే కదా ఫిదా అయ్యేది అనిపిస్తుంది. ఇక గీత గోవిందం సినిమా ఆగస్టు 15 న విడుదలకు సిద్దమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*