అర్జున్ రెడ్డి ‘రౌడీ’.. అయితే!

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ చరిత్రలోనే ఒక సెన్సేషన్. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అవతారమెత్తాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ కి అలవాటు పడ్డాడు కూడా. అర్జున్ రెడ్డి సినిమాలో ఎలాంటి యాటిట్యూడ్ చూపించాడో… ఆ సినిమా తర్వాత పబ్లిక్ లోనూ అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ నే విజయ్ దేవరకొండ చూపించాడు. ఆ సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ పై భారీ అంచనాలు పెరిగేలా చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో రఫ్ స్టూడెంట్ గా ఎవ్వరినీ కేర్ చెయ్యని కుర్రాడిలా.. విపరీతంగా ప్రేమించే యువకుడిలా, డాక్టర్ లా ఇలా అన్ని విషయాల్లోనూ అద్భుతమైన వేరియేషన్స్ చూపించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్ ని పూర్తి స్థాయిలో తన వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేసాడు.

అభిమానుల కోసం పార్టీ…

అందుకే యువత కోసం ఏకంగా ‘రౌడీక్లబ్.ఇన్’ అనే ఒక వెబ్ సైట్ ని లాంచ్ చేసాడు. తనతో పాటుగా తన అభిమానులు కూడా రౌడీలే అంటూ విజయ్ చేస్తున్న పనులకు యూత్ కూడా బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక తన ఫాన్స్ కోసం జులై 15 న ఒక సన్ డౌనర్ పార్టీ కోసం విజయ్ దేవరకొండ వినూత్నమైన ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసాడు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ బైక్ మీద కేవలం జీన్స్ ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకోకుండా అచ్చం ఒక రౌడీ లా బైక్ డ్రైవ్ చేస్తూ చాలా రఫ్ లుక్ లో ఉన్న పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఆ లుక్ చూస్తేనే విజయ్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. కేవలం విజయ్ ఫాన్స్ మాత్రమే కాదు యూత్ మొత్తం విజయ్ రౌడీ గెటప్ కి ఫిదా అవుతున్నారు.

విడుదలకు సిద్ధమవుతున్న మూడు సినిమాలు…

మరి రఫ్ అండ్ టఫ్ అర్జున్ రెడ్డి ఒక్కసారిగా రౌడీలా మారిపోతే… ఎలా ఉంటుందో ఆ పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తుంది. మరి ఈ విధంగా విజయ్ దేవరకొండ తన అభిమానుల సంఖ్యను విపరీతంగా పెంచుకునే ప్రయత్నం బాగా చేస్తున్నాడు. ఏమైనా యంగ్ హీరోల ఆలోచనలే వేరప్పా.. అందుకే విజయ్ ఇలాంటి వినూత్న ప్రయోగాలను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం విజయ దేవరకొండ సినిమాలు వరసబెట్టి విడుదలకు రెడీ అవుతున్నాయి. మొదటగా గీత గోవిందం విడుదలకు లైన్ లో ఉంటే… ఆ వెంటనే.. టాక్సీవాలా, నోటా సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*