అశ్వనీద‌త్ కి ఆ కోరిక తీరేనా?

మెగా స్టార్ చిరంజీవికి వైజ‌యంతి మూవీస్ అధినేత‌ అశ్వనీద‌త్ కి మధ్య అనుబంధం వేరే చెప్పనవసరం లేదు. గతంలో చిరంజీవి హీరోగా అశ్వనీద‌త్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలను నిర్మించారు. అందులో ఒకటి `జ‌గ‌దేక వీరుడు-అతిలోక సుంద‌రి’. ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనమైన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. మరి ఆ తర్వాత ఏమైందో ఏంటో చిరంజీవితో సినిమాలు నిర్మించలేకపోయారు ద‌త్. కనీసం మెగా ఫామిలీ హీరోస్ తో కూడా సినిమాలు తీయలేదు.

మల్టీస్టారర్ కూడా……

అయినా చిరంజీవితో ఒక్క సినిమా అయినా తీయాలని తన కోరిక అని దత్ చాలాసార్లు చెప్పారు. కానీ అది కుదరట్లేదు. ఈమధ్య చిరు – పవన్ ఇద్దరినీ క‌లిపి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ని నిర్మించేందుకు ద‌త్‌ ప్లాన్ చేశారు. అందుకు క‌ళాబంధు టీఎస్సార్ స‌మ‌క్షంలో పెద్ద ప్లాన్‌నే వేశారు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. చిరంజీవి ఏమో సినిమాలతో బిజీ అవ్వడం..పవన్ సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్లడంతో ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడినట్లయింది. ఆ తర్వాత వైజ‌యంతి మూవీస్ లో చరణ్ తో `జ‌గ‌దేకవీరుడు-అతిలోక సుంద‌రి 2` తెర‌కెక్కించాల‌ని ద‌త్ ప్రయ‌త్నించారు. అందుకు అంత ఓకే అనుకున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీని బ‌రిలో దించాల‌ని ప్లాన్ వేశారు. కానీ అది కూడా వర్కవుట్ కావ‌డం లేదు. దాంతో ఈరెండు ప్రాజెక్ట్స్ ఆలా పెండింగ్ లో పడిపోయాయి .

ఇప్పట్లో లేనట్లే…….

చరణ్ ఏమో తన తండ్రి హీరోగా చేసే సినిమాలన్నీ తన సొంత బ్యానర్ లో నిర్మించుకుంటున్నాడు. సో చిరంజీవితో ఇప్పటిలో దత్ నిర్మించే అవకాశాలు లేవు. చరణ్ కూడా చాలా సినిమాలతో బిజీ ఉన్నారు. ఆ క్రమంలోనే అశ్వనీద‌త్ ‘దేవ‌దాస్’, ‘మ‌హ‌ర్షి’ వంటి చిత్రాల‌తో బిజీ అయిపోయారు. కానీ దత్ మాత్రం ఎట్టిపరిస్థితిలో చిరంజీవితో సినిమా చేయాలనీ కంకణం కట్టి కుర్చున్నాడట. మరి అతని మెగా ప్లాన్స్ ఎప్పటికి వ‌ర్కవుట్ అవుతాయోన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది. రీసెంట్ గా దత్ బ్యానర్ లో ‘మ‌హాన‌టి’ వచ్చి సూపర్ సక్సెస్ అయినా విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*