ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత’ తెరకెక్కుతుంది. ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అని అర్ధం అవుతుంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాలో చూపించినంతా యాక్షన్ ఎపిసోడ్స్ మరే సినిమాలో చూపించలేదని చెబుతున్నారు యూనిట్ సభ్యులు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త ఎన్టీఆర్ అభిమానులను నిరుత్సాహ పరుస్తోంది.

డ్యాన్స్ చూసే అవకాశం లేదా..?

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌ చూసేందుకు అవకాశం లేదంట. అదేంటి అని ఆశర్యపోతున్నారా.? ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ఫారెన్ లో షూట్ చేయాల్సిన ఓ సాంగ్ ను తొలగించారని సమాచారం. డాన్స్ చేయాల్సిన సాంగ్ తొలగించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడుతున్నారు. ఈ సాంగ్ కాకుండా సినిమాలో ఇంకా నాలుగు సాంగ్స్ మాత్రమే ఉంటాయి, అవి కూడా మోనిటేజ్ రూపంలో బ్యాక్ గ్రౌండ్ లో అలా వెళ్లిపోతాయి అని అంటున్నారు.

చిన్న చిన్న స్టెప్స్ తప్ప…

రీసెంట్ గా ఈ సినిమాలో మొదటి సాంగ్ ‘అనగనగా’ అనే ట్రాక్ ను రిలీజ్ చేయగా అది పర్లేదు అనిపించుకుంది. ఇది రొమాంటిక్ సాంగ్ అని అర్ధం అవుతుంది. సో ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ చేసే అవకాశం లేదు. ఈ రోజు ‘అరవింద సమేత’ నుండి రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ‘పెన్విటీ’ అనే పేరుతో వస్తున్నా ఈ సాంగ్ రాయలసీమ తాలూకు నేపధ్యాన్ని చెబుతారు అని అర్ధం అవుతుంది కనుక ఈ సాంగ్ లో ఎన్టీఆర్‌ డ్యాన్స్ చెయ్యటానికి స్కోప్ లేదని తెలుస్తోంది. ఈ రెండు కాకుండా ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్ అని తెలుస్తుంది. ఇక నాలుగో పాట మెలోడీ అంటున్నారు. ఒకవేళ ఇందులో డాన్స్ చేసే స్కోప్ ఉన్నా చిన్నచిన్న స్టెప్స్ ఉండే అవకాశముంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది చేదు వార్తే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*