బాహుబలి రికార్డ్స్ ఆ సినిమా పైనే ఉన్నాయి..!

Bahubali Records 2.o film

గత ఏడాది రిలీజ్ కి ముందు బాహుబలి 2 ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. బాహుబలి 1 చివరిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న క్యూరియాసిటీ దేశం మొత్తం మొదలై బాహుబలి 2 పార్ట్ కోసం వెయిట్ చేసేలా చేసాడు రాజమౌళి. దాంతో ఈ సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేకుండా సరిపోయింది. జనాలే దీన్ని ప్రమోట్ చేసారు. ప్రొడ్యూసర్స్ కి ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేకపోయింది. దాంతో ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో అందరికి తెలిసిందే.

బాహుబలి రికార్డు బ్రేక్ చేసేందుకు

‘బాహుబలి’ రికార్డ్స్ ని బ్రేక్ చేసేందుకు ఈ నెల రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అందులో ఒకటి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రిలీజ్ అయిపోయింది. ఆమిర్ ఖాన్, అమితాబ్ లాంటి స్టార్ హీరోస్ నటించినా డిజాస్టర్ గా నిలవడంతో ‘బాహుబలి’ రికార్డ్స్ సేఫ్ అయ్యాయి. ఇక ఇప్పుడు అందరి కళ్లు ‘2.0’ మీద పడ్డాయి. మరో 10 రోజులల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో హైప్ రావట్లేదు. లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇచ్చేస్తూ హైప్ పెంచడానికి ప్రయత్నిస్తోంది. కానీ జనాల్లో ఎటువంటి క్యూరియాసిటీ కనిపించడం లేదు.

ట్రైలర్ విడుదల చేసినా…

దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అంత గొప్పగా లేకపోవడంతో ఈ సినిమా గురించి ఎవరు పెద్దగా పటించుకోట్లేదు. ‘బాహుబలి’లా జనాలు దీన్ని నెత్తిన పెట్టుకోవట్లేదు. మరి ఈ నేపధ్యంలో ‘బాహుబలి’ రికార్డుల్ని ఇది బద్దలు కొట్టగలదా?.. ఆశించిన స్థాయిలో దీనికి ఓపెనింగ్స్ వస్తాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయితే తప్ప బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*