బాల‌య్య‌ను సీఎంగా చూస్తామా..?

బాలయ్యకు బోయపాటితో కుదిరినట్టు ఇంకా ఏ డైరెక్టర్ తో అంత ఈజీగా సెట్ అవ్వదనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే బాలయ్య ఫ్యాన్స్ లోనే కాదు.. సాధారణ సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ‘సింహ, లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్ లో ఎప్పటి నుండో మూడో సినిమా వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. సినిమా మాత్రం కచ్చితం అని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. ఇప్పటికే కథ చర్చల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది.

100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథకు అనుగుణంగా భారీ బడ్జెట్ అంటే దాదాపుగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కవచ్చనే న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ ని ఊపేస్తోంది. అంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుంది అంటే బాలకృష్ణని ఏ రేంజ్ లో ఈ సినిమాలో చూడబోతామో అంటూ అప్పుడే బాలయ్య ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. అయితే ఇక్కడ కూడా లేటెస్ట్ న్యూస్ ప్రకారం బోయపాటితో తెరకెక్కబోయే చిత్రంలో బాలయ్య సీఎం పాత్రలో నటించనున్నాడట. వచ్చే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే బోయపాటి ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడట.

కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్‌తో

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ… ఈ వార్త మాత్రం బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఇక ఈ వార్త గనక నిజమైతే బాలకృష్ణ కెరీర్ లోనే ఇంట భారీ బడ్జెట్ చిత్రం చెయ్యడం ఇదే మొదటిసారి. ఎందుకంటే ఎన్టీఆర్ – క్రిష్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ బయో పిక్ బడ్జెట్ దాదాపుగా 80 కోట్లు అంటున్నారు. మరి ఈ లెక్కన బోయపాటి సినిమానే బాలయ్యకి భారీ బడ్జెట్ మూవీ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్న బాలయ్య..త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా తెలియాల్సి ఉంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*