ఏకే 47 టైటిల్ బాలయ్యకు కాదట..!

balakrishna for no 1 yaari

మాస్ డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒకవేళ క్రిష్ ని ఈ లోపల ఎన్టీఆర్ బయోపిక్ కి రెడీ చేస్తే బయోపిక్ చేసే ఉదేశంలో ఉన్నాడు బాలయ్య. అది లేట్ అయ్యే అవకాశం ఉంటె వినాయక్ తో సినిమా చేసి.. ఎట్టి పరిస్థితిల్లో సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు బాలయ్య. అయితే గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఒకటి జోరుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ – వినాయక్ ల సినిమాకి ఏకే 47 అనే టైటిల్ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఏకే 47 టైటిల్ అనగానే నందమూరి అభిమానుల్లో కూడా కొత్త ఆశలు చిగురించాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ టైటిల్ బాలయ్యది కాదని తేలడంతో అందరు షాక్ అయ్యారు.

వేరే సినిమా కోస‌మ‌న్న క‌ళ్యాణ్‌

నిర్మాత సి కళ్యాణ్ ఛాంబర్ లో ఏకే 47 అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.ఎప్పటినుండో కళ్యాణ్ బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాడని అనుకున్నారు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ అంతా ఈ టైటిల్ బాలయ్య సినిమా కోసమే అనుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. అయితే కళ్యాణ్ మాత్రం ఇది బాలయ్య సినిమా కోసం కాదని, వేరే సినిమా కోసమని చెప్పాడు. దాంతో బాలయ్య ఏకే 47 అంటూ వస్తున్నా ప్రచారానికి తెర పడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*