ఇప్పుడు బాలయ్య ఏం చేస్తాడు..!

balakrishna will give mahanayakudu rights free

బాలకృష్ణ చాలా ఏళ్లుగా ప్లాఫులతో సతమతమవుతున్నప్పుడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి బాలకృష్ణకి సింహ సినిమాతో మాస్ హిట్ ఇచ్చాడు. సింహ సినిమాతో బాలకృష్ణ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తరవాత మళ్ళీ లెజెండ్ తో బాలకృష్ణకి తిరుగులేని హిట్ ఇచ్చాడు బోయపాటి. కుటుంబ అనుబంధాలతోనే.. మాస్ ఎంటర్టైనర్ లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్. లెజెండ్ లో విలన్ రోల్ ని కూడా బాగా హైలెట్ చెయ్యడం.. బాలకృష్ణ పాత్రతో పాటుగా విలన్ జగపతి బాబు పాత్రని కూడా బాగా ఎలివేట్ చేశాడు బోయపాటి. మరి లెజెండ్ తో బాలయ్య పవర్ ఫుల్ నటన, డైలాగ్ డెలివరీ నందమూరి అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేశారు. ఇక లెజెండ్ తర్వాత బాలకృష్ణ వేరే దర్శకులతో బిజీ అయినప్పటికీ.. బోయపాటికి మళ్లీ బాలయ్య దొరికితే బాగుండు అంటూ అయన కోసం కథలు రాసుకున్నాడు. మధ్యమధ్యలో బెల్లంకొండతో, ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాలు చేసుకున్నాడు.

వినయ విధేయ రామ హిట్ కాకపోవడంతో

ఇక బాలకృష్ణ ఈ మధ్యనే అంటే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తదుపరి చిత్రం తన నిర్మాణ సంస్థలోనే బోయపాటి డైరెక్షన్ లో ఉండబోతుందని.. ఫిబ్రవరిలో బోయపాటి – తన కాంబోలో మూవీ పట్టాలెక్కుతుందని ప్రకటించాడు. ఇక తాజాగా బోయపాటి రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ తాజాగా సంక్రాతి కానుకగా విడుదలైంది. కేవలం మాస్ ప్రేక్షకులు మెచ్చేలా బోయపాటి వినయ విధేయ రామని తెరకెక్కించాడని… కానీ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కదని ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా తేల్చేశారు. ఇక సినిమాలో విలన్ రోల్ చేసిన వివేక్ కేరెక్టర్ కూడా తేలిపోయిందంటున్నారు. అయితే ప్రస్తుతం కథానాయకుడుతో డీసెంట్ హిట్ అందుకున్న బాలయ్య.. ఫిబ్రవరి 7న మహానాయకుడుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి మహానాయకుడు కూడా హిట్ అనే సంకేతాలు అందుతున్నాయి. ఇలాంటి టైంలో బాలకృష్ణ వినయ విధేయ రామతో యావరేజ్ హిట్ అందుకున్న బోయపాటితో సినిమా చేస్తాడంటే కాస్త డౌటే. మరి బాలకృష్ణ, బోయపాటి సినిమా విషయమై మళ్ళీ పునరాలోచిస్తాడేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*