బాలయ్య కోసం కథ రెడీ

balakrishna will give mahanayakudu rights free

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, వినాయక్ డైరెక్షన్ లో ఓ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. మొదటి నుండీ బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. తను కూడా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుంటాడు. అసలు విషయంలోకి వెళ్తే..బాలకృష్ణ సినిమాలకి డైలాగ్ రైటర్ గా పని చేసి పేరు తెచ్చుకున్న ఎం.రత్నం.. కొంతకాలం నుండి ఓ కథపై కసరత్తు చేస్తూ వచ్చాడు. లేటెస్ట్ గా ఆ కథ కూడా పూర్తయింది. త్వరలోనే ఆ కథను బాలకృష్ణ వినిపించే ప్రయత్నం చేస్తా అంటున్నాడు రత్నం.

నచ్చితే బోయపాటితో…

బాలకృష్ణ సినిమాకి కథ ఎలా ఉండాలి .. ఏయే సందర్భాల్లో ఆయన చెప్పే డైలాగ్స్ ఏ స్థాయిలో ఉండాలనే విషయం రత్నానికి బాగా తెలుసు. అవి దృష్టిలో పెట్టుకునే ఆ కథ రెడీ చేసాడంట. బాలకృష్ణకు ఆ కథ నచ్చితే ఆయన బోయపాటితో చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*