పాపం బాలయ్య

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ సినిమా విషయంలో ఇంకా తికమకలోనే ఉన్నాడు. డైరెక్షన్ బాధ్యతల నుండి తేజ తప్పుకోవడంతో ప్రస్తుతం తానే డైరెక్ట్ చేస్తున్నా అంటున్నప్పటికీ చంద్ర సిద్దార్ధ్ పర్యవేక్షణలోనే ఆ దర్శకత్వ బాధ్యతలు చేపడతాడనే టాక్ వచ్చింది. అలాగే బయో పిక్ ని పక్కన పెట్టేసి బాలయ్య వినాయక్ సినిమా కి తయారవడం వంటివి బాలయ్య ఫాన్స్ లో నిరాశను పెంచేస్తున్నాయి. అయితే బయో పిక్ తో పాటే వినాయక్ సినిమా చెయ్యడానికి బాలయ్య సిద్దంగానే ఉన్నాడట. సి.కళ్యాణ్ నిర్మాతగా వినాయక్ సినిమా తో బాలయ్య అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతున్నాడని టాక్ వినబడుతుంది.

మళ్లీ శ్రేయనే…

పక్కా మాస్ కథతో ఫాన్స్ కి నచ్చే విధంగా వినాయక్.. బాలయ్య సినిమా కథని రెడీ చేస్తున్నాడట. ఎలా రెడీ చేసినా వినాయక్ ప్లాప్స్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో బాలయ్య అతనికి అవకాశం ఇవ్వడమేమిటంటూ ఫాన్స్ గరంగరంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు బాలయ్య గత సినిమాల హీరోయిన్ శ్రేయనే బాలయ్యకి జోడిగా ఎంపిక చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి బాలకృష్ణ పక్కన సీనియర్ హీరోయిన్స్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతోనే పదే పదే శ్రియ ని ఎంపిక చేస్తున్నారనే కామెంట్ సోషల్ మీడియాలో వస్తోంది.

వివాహం తర్వాత మొదటి సినిమా..

ఇక శ్రేయ గతంలో బాలకృష్ణ సరసన చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో నటించింది. నాలుగోసారి ఆమె ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీ కడుతోంది. వివాహమైన తరువాత శ్రియ చేస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మరి బాలకృష్ణ – వినాయక్ కాంబో మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ అంచనాలుండవు. ఇలాంటి టైం లో బాలయ్య కేవలం ఎన్టీఆర్ బయో పిక్ మీద దృష్టి పెడితేనే బావుంటుంది. అలాగే వినాయక్ తో సినిమా డ్రాప్ అయితే బావుంటుంది అంటూ ఫాన్స్ చెబుతున్నారు. చూద్దాం బాలయ్య ఏం చేస్తాడో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*