సినిమా ఫట్టు..హీరో హిట్టు..!

మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ పక్కన నటించే అవకాశం దక్కింది బెల్లంకొండ శ్రీనివాస్ కి. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ నటించి మీడియం రేంజ్ హీరోస్ లిస్ట్ లో చేరిపోయాడు ఈ హీరో. సినిమాలో కంటెంట్…గ్రిప్పింగ్ స్టోరీ – స్క్రీన్ ప్లే ఉంటె జనాలు తప్పకుండా ఆదరిస్తున్న రోజులివి. అయితే అదే కాన్ఫిడెన్స్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ అనే సినిమాలో నటించారు. అది లేటెస్ట్ గా రిలీజ్ అయింది. అయితే మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం నిలబడుతుందో చూద్దాం.

విజువల్స్ కే ప్రాధాన్యత…..

కేవలం సినిమా కథ.. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ తోనే ఈ సినిమా తీశామని మొదటినుండే చెప్పుకున్నారు మేకర్స్. అయితే తొలిరోజు ఈ సినిమా అంతంత మాత్రమే అనిపించుకుంది. విజువల్ గ్రాండియర్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్ కి ఉన్న ప్రాధాన్యత ఇతర ఏ అంశాల్లోనూ కనిపించలేదని విమర్శించారు. దాంతో తొలి రెండు రోజులు పర్లేదు అనిపించుకున్న.. సోమవారం నాటికి వసూళ్ల పరంగా డౌన్ ఫాల్ మొదలైందని ట్రేడ్ చెబుతుంది.

శ్రీనుకు మంచి మార్కులు….

అయితే వసూళ్ళు పక్కన పెడితే ఇందులో హీరోగా నటించిన బెల్లం బాబుకి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. అతడు ఈ సినిమా కోసం కష్టపడిన తీరు చూసి అందరు ప్రశంసల జల్లు కురిపించారు. యాక్టింగ్ పరంగా కూడా గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా బెటర్ గా చేసాడని చెప్పుకుంటున్నారు. మంచి కథ.. మంచి డైరెక్టర్ దొరికితే తప్పకుండా షైన్ అవుతాడన్న పాజిటివ్ నోట్ రావడం సానుకూలాంశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*