బెల్లంకొండ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..!

పాపం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. అయినా కానీ ఏమాత్రం తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్లీపోతున్నాడు ఈ యంగ్ హీరో. మనోడిలో టాలెంట్ ఉన్నా అవి సక్సెస్ దాకా తీసుకుని వెళ్లలేకపోతున్నాయి. దానికి కారణం అతని సినిమాలకి అతని మార్కెట్ కన్నా బడ్జెట్ ఎక్కువ పెట్టడం. కంటెంట్ కు మించి కాస్టింగ్ ఎక్కువ ఉండటం వల్లే అతని సినిమాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అందుకే తన తర్వాతి రెండు సినిమాల కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

రెండింటిలో కాజల్ హీరోయిన్…

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ హీరోయిన్ గా తేజ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీనివాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాతో పాటు కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమాలో చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ‘మిస్టర్ పోలీస్’ అనే టైటిల్ తో వస్తున్నా ఈ సినిమాలో కూడా కాజలే హీరోయిన్. ఇందులో శ్రీనివాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

బడ్జెట్ తగ్గించే ప్రయత్నం…

దీనికి చోటా కె నాయుడు లాంటి సీనియర్ టెక్నీషియన్ కెమెరా మ్యాన్ గా పనిచేయనున్నారు. దీనికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ రెండు సినిమాల బడ్జెట్ ఎక్కువ కాకూడదని సాయి శ్రీనివాస్ మేకర్స్ కి చెప్పాడంట. అంతేకాకుండా షూటింగ్ కూడా అనుకున్న టైంలోనే జరగాలని.. ఒక్కరోజు కూడా మనీ వేస్ట్ కాకూదని నిర్మాతలకు చెబుతున్నాడట. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న శ్రీనివాస్ కి ఈ రెండు సినిమాలతో అయినా మొదటి సక్సెస్ అందుకుంటాడేమో చూద్దాం. ఈ రెండు సినిమాలో తేజ సినిమా ముందు వచ్చే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*