బెల్లంకొండ నెక్స్ట్ మూవీ హిందీ రైట్స్ ఎంతో తెలుసా?

seetha movie rights

హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే ఇప్పుడున్న యంగ్ హీరోస్ తో పోటీగా నిలబడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడున్న కాంపిటేషన్ లో పలు జాగ్రతలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. లేటెస్ట్ గా ఈయన నటించిన ‘సాక్ష్యం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు.

బాగానే హోప్స్ పెట్టుకుని…..

రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై శ్రీనివాస్ బాగానే హోప్స్ పెట్టుకున్నాడు. ఇది ఇలా ఉండగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యువ హీరో. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడుతో తన తర్వాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ క్వీన్ కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

సగంకూడా పూర్తి కాక ముందే…..

ఈ కథ కొత్తదనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠ భరితంగా సాగిపోతుందట. ఈ టాక్ బయట షికార్లు కొడుతుందనేమో ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను ఓ పెద్ద సంస్థ 9.5 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం. షూటింగ్ సగం కూడా కంప్లీట్ చేయకుండానే ఈ స్థాయిలో హిందీ శాటిలైట్ రైట్స్ పలకడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.

Ravi Batchali
About Ravi Batchali 15675 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*